/rtv/media/media_files/2025/02/20/k9EpICLjNnS7sUsalhgc.jpg)
MLC Kavitha
Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంబేద్కర్(Ambedkar) ను ఆయన వారసులను అవమానిస్తున్నాడని, అందుకే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేయలేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) విమర్శించారు. అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti) లోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కేబినెట్ మొత్తం వెళ్లి పూలదండలు వేయాలని లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి మేమే అంబేద్కర్ ను గౌరవించుకుంటామని కవిత అన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో దళిత బంధు సాధన సమితి సమావేశం(Dalit Bandhu Sadhana Samiti Meeting) నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..కాలేజీకి అంటుకున్న మంటలు
ఎస్సీ వర్గీకరణ పేరుతో మరో మోసం
ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదన్నారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయన్నారు. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి.. వెంటనే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దు... ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ఉండాలన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారన్నారు. వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దన్నారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉంది. రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంకాగాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని కవిత అన్నారు.
Also Read: Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు
మనసున్న ప్రభుత్వం కాదు
దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలకు బదులు 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారన్నారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను ఇవ్వాలని సవాల్ విసిరారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలన్నారు. ఎస్సీలకు బడ్జెట్ లో 33 వేల కోట్లు కేటాయించి... కేవలం 9800 కోట్లే ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించారన్నారు. రేవంత్ రెడ్డిది మనసున్న ప్రభుత్వం కాదని, మానవత్వం లేనిదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆలోచన చిన్నది ... చూపు పెద్దవాళ్లపైనే ఉంటుందన్నారు. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? అని ఆమె ప్రశ్నించారు.
అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్
అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచనని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో దళిత బంధును ప్రవేశపెట్టారని తెలిపారు.అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ అన్న కవిత అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందన్నారు. అంబేద్కర్ పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని కవిత గుర్తు చేశారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్