/rtv/media/media_files/2026/01/10/fotojet-2026-01-10t070228-7-2026-01-10-07-02-50.jpg)
Land mafia rampage in Kollur at midnight.
Land Mafia : నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కనిపించిన భూమిని కబ్జా చేయడానికి మాఫియా ముఠాలు వెనుకాడటం లేదు. కోకాపేట(kokapet-land-auction) వంటి ప్రాంతాల్లో భూములు ఎకరానికి రూ.వందల కోట్లు పలుకుతున్నాయి. దీంతో మాఫియా ఆ భూములపై కన్నేసింది. తాజాగా సంగారెడ్డి జిల్లా(sangareddy) రామచంద్రాపురం మండలం కొల్లూరులో అర్థరాత్రివేళ సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ఓ ముఠా ప్రయత్నించడం కలకలం రేపింది. బాధితులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రికి రాత్రే జరిగిన భూ కబ్జా యత్నాన్ని అడ్డుకున్నారు. కబ్జా కోసం ఏకంగా సుమారు రెండు వందల మంది దుండగులు రాత్రి. 9.30 నిమిషాలకు కోల్లూరుకు చేరుకుని అర్థరాత్రి 1 గంటలవరకు నానా వీరంగం చేశారు.
Also Read : నగరానికి సంక్రాంతి శోభ.. పల్లెబాటపట్టిన పట్టణం
Land Mafia Rampage In Kollur At Midnight
వివరాల్లోకి వెళ్తే.. కొల్లూరులోని సర్వే నంబర్ 192లో ఉన్న భగవంత్‌రెడ్డి అనే వ్యక్తి భార్య జి. మాధవికి చెందిన 5.12 గుంటల భూమి, చదలవాడ శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన 4 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు 200 మంది దుండగులు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డులపై దాడి చేశారు. వారిని బలవంతంగా ఓ వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లి.. నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. కంటైనర్, నేమ్ బోర్డులు, రైలింగ్ పైపులతో డీసీఎం, ట్రాలీ ఆటోల్లో అర్థరాత్రి వచ్చారు. జేసీబీల సహాయంతో ప్రహరీ గోడలను తొలగించి రైలింగ్ పైపులను బిగించారు. తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహారీ నిర్మించడానికి రెండు డీసీఎం వ్యాన్లలో బ్లూషీట్ రేకులను, ఇతర సామగ్రిని తీసుకువచ్చారు.
అక్కడ పనిచేస్తున్న మరో వాచ్ మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్ వైజర్.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే నంబరు 192లో ఉన్న 5.12 ఎకరాల భూమి తనదేనని, 1999లో దానిని కొనుగోలు చేశానని భూయజమానురాలు మాధవి పోలీసులకు వివరించారు. గురువారం రాత్రి కొందరు దుండగులు తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ప్రహారీని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, 26 మందిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక సీఐ సీఐ గణేష్ పటేల్ తెలిపారు. వారిలో దాదాపు 20 మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.
Also Read : జీవించి ఉన్న మేక నుంచి రక్తం సేకరణ.. అనుమానంతో ఎంక్వైరీ చేస్తే..
Follow Us