/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
ap Crime News
TG Crime: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కంచుస్తంభంవారి పాలెంకు చెందిన అనూష అనే మహిళ సైబర్ నేరగాళ్ల వలలో మోసపోయింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న ఆమెను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆన్‌లైన్‌లో వర్క్ ఫ్రమ్ హోం అవకాశం పేరుతో మోసం చేసి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అనూషకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉండే సమయాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. తాను కూడా కొన్ని ఆదాయ మార్గాలు వెతుకుతూ టెలిగ్రామ్ యాప్‌లో వర్క్ ఫ్రమ్ హోం ప్రకటన చూసి డబ్బులు కట్టింది.
సైబర్ మోసగాళ్ల మోసానికి మహిళ బలి..
అక్కడి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను టాస్క్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు. మొదట్లో కొంత నమ్మకంతో చిన్న మొత్తాల్లోనే ట్రాన్సాక్షన్లు చేయగా.. వారి మాటలు నమ్మి మెల్లగా భారీ మొత్తంలో డబ్బులు పెట్టారు. ఇతరులకు తెలియకుండా బ్యాంక్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టి సుమారు లక్ష రూపాయలకుపైగా సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో జమ చేసింది. అయితే చివరికి ఏ డబ్బూ రాక ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. బాధ భరించలేక కూకట్‌పల్లిలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది
ఆమె మృతదేహం వద్ద ఒక సూసైడ్ నోట్ లభించింది. అందులో నా తల్లిదండ్రులు, భర్త, కుమారుడికి ఈ బాధ కలగకూడదని ఎన్నో రోజులుగా ప్రయత్నించాను. కానీ ఈ నేరగాళ్లు నన్ను మానసికంగా చంపేశారు. నాలాంటి వారు ఇంకెవ్వరూ ఈ మోసగాళ్ల వలలో పడకూడదు. మన బాబును జాగ్రత్తగా చూసుకోండి అని హృదయవిదారకంగా రాసింది. ఈ సంఘటన యలమంచిలి మండలాన్ని విషాదంలో ముంచింది. గ్రామస్తులు ఆమె మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలలో అవగాహన పెంచాలని అనూష కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఒత్తిడిని పెంచే ఐదు ఆహారాలు.. వీటి ఎఫెక్ట్ తెలుసుకోండి
( AP Crime | ap crime latest updates | ap-crime-news | telugu-news | Latest News)