Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

'మొగలి రేకులు'..  ఈ పేరు తెలియని, వినని ప్రేక్షకులు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక సీరియల్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో  చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుంది.

New Update

Mogali Rekulu:  'మొగలి రేకులు'..  ఈ పేరు తెలియని, వినని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక సీరియల్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో  చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం  సృష్టించింది. సుమారు ఏడేళ్ల పాటు  బుల్లితెర ప్రియులను మంత్రముగ్దులను చేసింది.  1368 పైగా ఎపిసోడ్లు సాగిన ఈ సీరియల్ ఎక్కడ బోర్ కొట్టించలేదు. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులకు కొత్త ఆసక్తి, అనుభూతిని కలిగించింది. సీరియల్ ఆపేసి టైంలో కూడా  TRP చాట్ లో టాప్ లో ఉంది. 

Also Read: ఇస్రో ఛైర్మన్‌తో స్పేస్‌ నుంచి శుభాంశు శుక్లా ఫోన్ సంభాషణ.. ఏం మాట్లాడారంటే ?

ముగించడానికి కారణం అదే! 

అయినప్పటికీ ఈ సీరియల్ ని ముంగించేశారు. ఇలా  చేయడం వెనుక కారణమేంటో తెలిపారు హీరో సాగర్. ఇటీవలే  'ది 100' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆర్.కే  సాగర్ మొగలిరేకులు సీరియల్ గురించి ప్రస్తావించారు.  

Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

సాగర్ మాట్లాడుతూ.. "మొగలి రేకులు సీరియల్ ని ఎవరూ ఆపమని చెప్పలేదు!  నేనే స్టాప్ చేయమని చెప్పాను. మిగతా సీరియల్స్  మాదిరిగా ప్రేక్షకులకు సాగదీశాము అనే ఫీల్ రాకూడదు. ఎప్పుడైనా సరే  ఈ సీరియల్ గురించి తలుచుకోవాలి.. కానీ తిట్టుకోవద్దు! ఇదొక మాస్టర్ పీస్ లా ఉండిపోవాలని అనుకున్నాము!  అందుకే అక్కడితో ఆపేయమని చెప్పాను" అని తెలిపారు. 

ఈ సీరియల్లో సాగర్.. ఆర్కే నాయుడు, ధర్మ డ్యూయల్ రోల్లో పోషించాడు. ఈ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ సాగర్ ని.. ఆర్కే నాయుడుగానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. చాలా మంది ఆ పేరుతోనే పిలుస్తారు కూడా! 

Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

Advertisment
Advertisment
తాజా కథనాలు