Jubilee Hills Election: రూ.38 వేల క్యాష్.. 4 కేజీల బంగారం.. మాగంటి సునీత ఆస్తుల లెక్కలివే!

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు.

New Update
Maganti Sunitha

Maganti Sunitha

జూబ్లీహిల్స్ నియోజకవర్గం(jubilee hills election updates) నుంచి బీఆర్‌ఎస్‌(brs) అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత(maganti Sunitha) బుధవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమెతో పాటు పిల్లల పేరు మీద ఉన్న స్థిర, చరాస్తులు, అప్పుల వివరాలు కూడా అఫిడవిట్‌లో తెలిపారు. అయితే ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. చేతిలో రూ.38,800 నగదు ఉంది. అలాగే ఆమెకు చెందిన మూడు వేర్వేరు బ్యాంక్ ఖాతాలలో రూ.32 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారు, వెండి ఆభరణాల మొత్తం విలువ రూ.6,18,54,274 (ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు) ఉన్నట్లు తెలిపారు. ఆమె ముగ్గురు పిల్లల పేరు మీద కూడా షేర్లు, విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ సుమారుగా రూ.4.62 కోట్లుగా ఉంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఏపీ కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్.. జోగి రమేష్ వాట్సాప్ చాట్ లీక్!

ఆస్తులతో పాటు అప్పులు కూడా..

సునీత పేరుపై ఉన్న స్థిరాస్తుల్లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 34లో ఒక ప్లాటు, గోపనపల్లిలో మరొక ప్లాటు ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు ప్లాట్ల మొత్తం విలువ రూ.6.11 కోట్లు ఉంది. స్థిరాస్తుల విషయంలో పిల్లల పేరు మీద కూడా ఉన్నాయి. వారి పేరు మీద దాదాపుగా రూ.8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆస్తులతో పాటు అప్పులు కూడా సునీత పేరు మీద ఉన్నాయి. ఈమె పేరుపై సుమారుగా రూ.4.44 కోట్ల అప్పు ఉంది. అలాగే ఆమె పిల్లల పేరుపై రూ.6 కోట్లు అప్పు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో తెలిపారు. అయితే ఇటీవల ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కూడా నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: NCLT: NCLTలో జగన్‌కు చుక్కెదురు.. విజయమ్మకే ఆ షేర్స్!

Advertisment
తాజా కథనాలు