Munneru Floods: ఖమ్మంలో కల్లోలం.. ముప్పై ఏళ్ల తరువాత ముంచేసిన మున్నేరు.. ఎందుకిలా?
కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరుకు వరద వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తరువాత తీవ్రమైన వరద రావడంతో ఖమ్మం నగరంలో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. మున్నేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయకపోవడం, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.