TG: డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ! TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశాల్లో ఉన్న సమయంలో ఆయన ఇంటికి కన్నం వేసి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. ఇద్దరు నిందితులను పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. By V.J Reddy 27 Sep 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ్‌బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ్‌బెంగాల్ లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. আজ(২৬.০৯.২৪) বেলা এগারোটা নাগাদ খড়গপুর জি আর পি থানার পুলিশ খড়গপুর স্টেশনের ৭ নং প্লাটফর্মে যখন স্পেশাল চেকিং ডিউটি... Posted by Kharagpur GRP District on Thursday, September 26, 2024 వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారు అని ఖరగ్‌పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ చెప్పారు. నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్, ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. https://t.co/zkwtvjon43 — Kharagpur GRP District (@srp_kharagpur) September 26, 2024 అసలు భద్రత ఉందా?.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సరైన సమయంగా భావించిన దొంగలు.. వారి ఇంటికి కన్నం వేసి బంగారం, వెండి ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదును కాజేశారు. ఇదిలా ఉంటే ఈ దొంగతనంపై తెలంగాణ పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఓకే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇంట్లోనే చోరీ జరిగిందంటే సాధారణ వ్యక్తులకు అసలు భద్రత ఉందా? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా నుంచి భట్టి ట్వీట్.. అమెరికాలోని లాస్ వేగాస్ లో జరిగిన మైన్ ఎక్స్ పో -2024 ను సందర్శించి మైనింగ్ రంగంలో ప్రపంచ స్థాయి సాంకేతికత కు పేరుగాంచిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయినట్లు భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు. తెలంగాణలో ఖనిజ పరిశ్రమాభివృద్ధికి దోహదపడేలా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించినట్లు చెప్పారు. సింగరేణికి క్రిటికల్ మినరల్స్ అన్వేషణ రంగంలో సహాయ సహకారాలు కోరుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువుగా ఉన్న పలు అంశాలను వారికి వివరించినట్లు తెలిపారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి