/rtv/media/media_files/Py8HEtaReh6xbWCzZlBt.jpg)
మహబూబాబాద్ జిల్లాలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న చేపల లోడు లారీ అదుపు తప్పడంతో మరిపెడ గ్రామంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. లారీ బోల్తా పడటంతో బతికున్న చేపలు రోడ్డుపైన పడటంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. చెల్లాచెదురుగా రోడ్డుపై చేపలు పడటంతో ప్రజలు ఏరుకుని సంచుల్లో నింపుకున్నారు. రోడ్డు మొత్తం ఎటు చూసిన బతికున్న చేపలే కనిపించాయి. దీంతో ట్రాఫ్రిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం తరచుగానే వింటుంటాం. పాలు, మందు వంటి వ్యాన్‌లు బోల్తా పడుతుంటాయి.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో అదుపు తప్పి చేపల లోడ్ తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది..వ్యాన్ లో ఉన్న చేపలు చెల్లా చెదురుగా పడటం తో చేపల కోసం జనం ఎగబడ్డారు..#Fish#Mahabubabad#viralvideo#RTVpic.twitter.com/sIMh0MByLS
— RTV (@RTVnewsnetwork) September 24, 2024
Follow Us