ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్.. కళాశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

ఖమ్మంలోని SR కాలేజీ ఎదుట లోకేశ్‌ అనే విద్యార్థి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. తన కుమారుడికి బ్రెయిన్‌ డెడ్‌ అవ్వడానికి కారణం కాలేజీ యాజమాన్యమేనని ఆరోపిస్తున్నారు. అయితే లోకేశ్‌ కాలు జారీ సెకండ్‌ ఫ్లోర్‌ నుంచి కిందపడ్డాడని కాలేజీ యాజమాన్యం చెబుతోంది.

New Update
crime

ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి కళాశాల బిల్డింగ్‌పై నుంచి కాలు జారి పడిపోయిన ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దుంపల తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టపల్లి లోకేష్ ఖమ్మం నగరంలో ఎస్.ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో రెండో అంతస్తు కిటికీ నుంచి రాత్రి ఒంటిగంట సమయంలో లోకేష్ కాలు జారి పడిపోయాడని కళాశాల సిబ్బంది తెలిపింది. కానీ కళాశాల బిల్డింగ్ పై నుంచి పడటం వల్ల చిన్నగా కాలు ఫ్యాక్చర్ అయ్యి స్వల్పంగా గాయాలు అయ్యాయని లోకేష్ తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇచ్చింది.

ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

ఈ ప్రమాదం జరిగిన వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి లోకేష్‌ను చికిత్స నిమిత్తం కోసం తరలించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని, వెంటనే చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని లోకేష్ తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు. అసలు కుమారుడికి ఏం జరిగిందని కళాశాల యాజమాన్యాన్ని లోకేష్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కానీ కాలేజీ యాజమాన్యం వీరిని లోపలికి అనుమతించడం లేదు. దీంతో లోకేష్ కుటుంబ సభ్యులు కళాశాల గేట్ ఎదురుగా ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే కళాశాల దగ్గరకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు