Rains: రానున్న రెండు రోజులు వానలే..వానలు!

తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.దాంతో గురువారం మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

New Update
ap rains

Telangana: తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

దాంతో గురువారం మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌,  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని.. గంటకు 40-50 కిలోమీటర్ల గాలులు వీస్తూ వర్షాలు కురిసే పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

శుక్రవారం నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్‌, జనగాంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం చోటు చేసుకుంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్,  విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

ముంబై విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానం నంబర్ UK534 హైదరాబాద్‌కు తిరిగి వస్తోందని, రాత్రి 9.15 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుందని విస్తారా వివరించింది. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సిన మరో విమానం UK941 హైదరాబాద్‌కు మళ్లించడం జరిగింది. రాత్రి 9.10 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణీకులు తమ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని ‘స్పైస్‌జెట్’ ఎక్స్‌లో విజ్ఞప్తి చేసింది.

ముంబై , పొరుగు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలె జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ముంబైలోని పలు శివారు ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. ములుండ్ మరియు దాని పరిసరాల్లో భారీ వర్షపాతం నమోదైం. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాల్లో విపరీతమైన భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర కొంకణ్ నుంచి దక్షిణ బంగ్లాదేశ్ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో తుఫాను సర్క్యులేషన్ మీదుగా ఒక ద్రోణి నడుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముంబయి, పాల్ఘర్, నందుర్బార్, ధూలే, జల్గావ్, షోలాపూర్, సతారా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శాఖ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు