తెలంగాణలో డిజిటల్ అరెస్ట్.. రూ.15 లక్షలు ఫసక్!
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.15 లక్షలు దోచేశారు. మీ పేరు మీద మనీలాండరింగ్ జరిగిందంటూ బాధితున్ని భయపెట్టారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి బాధితుడి నుంచి డబ్బులు కొట్టేశారు.