BRS MLC Kavitha : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..ఎమ్మెల్సీ కవిత వార్నింగ్

ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్ననాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నిప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనిఎమ్మెల్సీకవిత అన్నారు. ఈరోజు కవిత ఖమ్మం సబ్ జైల్లోరిమాండ్‌లోఉన్నబీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ ను పరామర్శించారు.

New Update
 MLC Kavitha

MLC Kavitha

BRS MLC Kavitha : ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత ఖమ్మం సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. 

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!


 ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, కానీ కేసీఆర్ని, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరికి సాధ్యం కాదని కవిత అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించకుండా మమ్మల్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలన్ని, మోసాలన్నీ ప్రజల మనసుల్లోకి వెళ్లిపోయాయన్నారు.రైతులు, విద్యార్థులు, మహిళలతో పాటు అన్ని వర్గాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయన్నారు. 

 Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

14 నెలల పాలనలో రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అందరికీ తెలిసిపోయింది.ఆ భయంతోనే ఎవరిని పడితే వాళ్లను కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని కవిత ఆరోపించారు. గ్రామ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు సురేందర్ పై అక్రమ కేసు నమోదు చేసి జైలు పంపారన్నారు.ప్రభుత్వం నడపడం చేతగాక, పథకాలు అందించడం చేతకాక వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటామంటే కుదరదన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు వెంట పడుతూనే ఉంటామని స్పష్ట చేశారు. అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని కవిత తెలిపారు.

ఇది కూడా చదవండి: cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!

 బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తే కేసీఆర్‌‌ను అడ్డుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతు భీమా , ఫించన్, ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. రేవంత్‌వి అన్నీ దొంగ మాటలేనని విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో దొంగహామీలే తప్ప చేసింది ఏం లేదని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదేలే అని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా కల్పించారు. కేసులకు భయపడొద్దు, ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉందామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Also Read :  వల్లభనేని వంశీ అరెస్ట్‌..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

కాగా అంతకుముందు ఖమ్మం వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు చౌటుప్పల్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంత త్రిబుల్ ఆర్ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కవిత అన్నారు. త్రిబుల్ ఆర్ రైతులకు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటానని చెప్పి.. అధికారంలోకి రాగానే రేవంత్ మాట మరిచారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా త్రిబుల్ ఆర్ రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి త్రిబుల్ ఆర్ బాధితుల విషయంలో చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.

ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు