ACB Raids:  ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ ఆఫీసర్స్..ఎక్కడంటే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొమరారం రేంజ్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. రోడ్డు నిర్మాణ పనులకు ఓ రైతు పట్టా భూమిలో గ్రావెల్  తోలుకునేందుకు  ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను రూ.30 వేలు డిమాండ్ చేశారు.

New Update
ACB Raids

ACB Raids

ACB Raids: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని కొమరారం రేంజ్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. రోడ్డు నిర్మాణ పనులకు ఓ రైతు పట్టా భూమిలో గ్రావెల్  తోలుకునేందుకు  ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ను రూ.30 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఆ కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వాయిస్ రికార్డ్ ద్వారా ఆధారాలను సేకరించారు.  

Also Read: Supreme Court: ఆ మాటలు అసభ్యంగా లేవా..యూట్యూబర్‌ పై సుప్రీం కోర్టు సీరియస్‌!

Also Read: పచ్చి బొప్పాయి రసంలో పుష్కలంగా విటమిన్లు..ఎన్నివ్యాధులను నయం చేస్తుందో తెలుసా!

అనంతరం ఈరోజు సదరు కాంట్రాక్టర్‌ ఫారెస్ట్‌ అధికారులకు డబ్బులు ఇస్తానని చెప్పి ఏసీబీకి సమాచారం అందించాడు. ఈక్రమంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కాంట్రాక్టర్ రేంజర్ ఉదయ్ కిరణ్‌, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ కు రూ.30 వేలు ముట్ట చెబుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.. ఇలాంటి అవినీతి అధికారులపై తమకు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు.

జీతాలు తీసుకుంటూనే లంచాలకు ఆశ..

కాగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అధికారులు ఒకవైపు జీతాలు తీసుకుంటూనే లంచాలకు ఆశపడుతున్నారు. ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలో పనులు కావడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ కావాలని లంచాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాధికారులపై సామాన్యులు ఏసీబీకి సమాచారం అందిస్తున్నారు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి  అధికారులను రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు.

Also Read: యూనస్ ఒక ఉగ్రవాది..మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Also Read: నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో!

 

 

Also Read :  ప్రియాంక చోప్రాకు ఈ తీవ్రమైన వ్యాధి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు