/rtv/media/media_files/2024/11/21/UDDhzPi6oLbHTatFO8go.jpg)
BRS MLC Kavitha
TG News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల అరెస్టై జిల్లా కారాగారంలో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను మరిపరామర్శించనున్నారు. అనంతరం సేవాలాల్ వేడుకల్లో పాల్గొనడంతోపాటు పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు.
బీసీ సంఘాలతో సమావేశం..
ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం నగరంలోని సప్తపది ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీసీ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన గణాంకాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసిలకు కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే డెడికేషన్ రిపోర్ట్ నివేదికలోని పలు అంశాలు, ప్రభుత్వ హామీలు తదుపరి అంశాలపై నేతలతో మంతనాలు జరపనున్నారు.
ఇది కూడా చదవండి: Crime: భర్త పెళ్లికి రాలేదని భార్య ఆత్మహత్య.. ఆ తర్వాత అతను మరీ ఘోరంగా!
పింక్ బుక్ రెడీ..
ఇదిలా ఉంటే.. ఇటీవలే కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందికదా అని కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీఆర్‌ఎస్(BRS) కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతుందన్నారు. అన్ని పింక్‌బుక్‌లో రాసుకుంటున్నామని చెప్పారు. తిరిగి అధికారంలోకి వస్తామని, వచ్చాక అన్నీ తిరిగి చెల్లిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు. మీ లెక్కలు తీస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి రోజే ఇంటికి పోలీసులు వచ్చి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.