Khammam Crime News: జీవితాంతం జైల్లోనే.. చిన్నారిని చిదిమేసిన కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు!

2021 పోక్సో కేసులో ఖమ్మం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని చిదిమేసిన ఇద్దరు నేరగాళ్లు సంపత్, నవీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష సహా 2 లక్షల పదివేలు జరిమానా విధించింది. దీనిపై బాధితురాలి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.   

New Update
khammam case

Khammam 2021 POCSO case

Khammam Crime News: 2021 పోక్సో కేసు(POCSO Case)లో ఖమ్మం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని చిదిమేసిన ఇద్దరు నేరగాళ్లు సంపత్, నవీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష(Life Imprisonment) సహా 2 లక్షల పదివేలు జరిమానా విధించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తదనంతరం న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు వెల్లడించారు. దీనిపై బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.   

ఇది కూడా చూడండి:Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

ఐస్ క్రీం కొనిస్తామంటూ కిడ్నాప్.. 

ఈ మేరకు 2021లో ఖమ్మం నగరానికి చెందిన ఓచిన్నారిని ఐస్ క్రీం కొనిస్తామంటూ కిడ్నాప్ చేశారు. మాయమాటలు చెప్పి రమణగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ కాలేపల్లి సంపత్ (25), మంచికంటినగర్ కు చెందిన పసుపులేటి నవీన్ (25)   లైంగికదాడికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం చిన్నారిని ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి అస్వస్థతకు గురికావడంతో విషయం తెలుసుకుని ఖమ్మం అర్బన్ - ఖానాపురం హవేలీ పోలీసులను ఆశ్రయించారు చిన్నారి తల్లిదండ్రులు. బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాధు మేరకు క్రైం నంబర్ 70/2021 పోక్సో యాక్టు అండర్ సెక్షన్ 376AB, 366, 294(b), 323, 506, 109 కింద అప్పటి సీఐ ప్రస్తుత డీఎస్పీ ఇంటలిజెన్స్ వెంకన్నబాబు కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చదవండి:Rape case: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లిపేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!

అయితే ఈ కేసులో బాధితుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ. శంకర్ వాదనలు వినిపించారు. నేరగాళ్లను తప్పించకుండా సమగ్ర ఆధారాలు సేకరించడంలో వెంకన్న బాబు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత సీఐ భానుప్రకాష్ సహా కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, నాగేశ్వర్ రావును కేసుకు సహకరించారు. వీరందరినీ ఖమ్మం సీపీ సునీల్ దత్ అభినందించారు. నేరగాళ్లు కాలేపల్లి సంపత్, పసుపులేటి నవీన్ పై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో పదికిపైగా కేసులు నమోదైనట్లు తెలిపారు. మెజిస్ట్రేట్ తీర్పుతో తమకు ఇన్నాళ్లకైనా న్యాయం జరిగిందని బాధితురాలి కుంటుంబం సంతోషం వ్యక్తం చేసింది. 

ఇది కూడా చదవండి:Viral News: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే!

Advertisment
తాజా కథనాలు