/rtv/media/media_files/2025/04/04/XRTYMu8BitnoI50pvddr.jpg)
MLA CPR Photograph: (MLA CPR )
Congress MLA CPR: భద్రాచలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతోపాటు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. ఈక్రమంగా అక్కడికి చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వచ్చారు. కాంగ్రెస్ నాయకుడు సుధాకర్ అనే వ్యక్తి అకస్మాతుగా అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. వెంటనే అతనికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. సుధాకర్ గుండెపోటుకు గురైనట్లు సమాచారం సమయానికి స్పందించి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేశారు.
Also read: urine: నా మూత్రం తాగడం వల్లే నేను ఆరోగ్యంగా ఉంటున్నా.. ఎలాగంటే?
భద్రాచలంలో కాంగ్రెస్ నేతకు గుండెపోటు – సీపీఆర్ చేసిన రక్షించిన ఎమ్మెల్యే.
— greatandhra (@greatandhranews) April 4, 2025
భద్రాచలంలో కాంగ్రెస్ నేత గుండెపోటుతో కుప్పకూలగా, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
తక్షణమే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించారు. #CPR #Bhadrachalam pic.twitter.com/0O0LBjsHAw
Also read: Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియాలో వైరల్
అనంతరం తదుపరి చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంలో అక్కడున్న వారు వీడియోలు తీశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరైన సమయంలో ఎమ్మెల్యే వేగంగా స్పందించారని ఆయన్ని మెచ్చకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట రావు పై ప్రసంశలు కురిపిస్తున్నారు.