urine: నా మూత్రం తాగడం వల్లే నేను ఆరోగ్యంగా ఉంటున్నా.. ఎలాగంటే?

ప్రముఖ వెల్నెస్ కోచ్ ట్రాయ్ కేసీ ఆయన హెల్త్ సీక్రెట్ బయటపెట్టాడు. తన మూత్రం తాను తాగడం వల్లే ఆరోగ్యంగా ఉన్నానని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఉదయాన్ని విసర్జించే మూత్రం మూడు వారాలపాటు నిల్వ చేసి రోజు దాన్ని తాగుతానని ట్రాయ్ కేసీ చెప్పాడు.

New Update
Troy Casey

Troy Casey Photograph: (Troy Casey)

అతనొక మాజీ మోడల్‌తోపాటు వెల్నెస్ కోచ్ కూడా. అతనికి ఇప్పటివరకు ఆయనకు చిన్న ఆరోగ్య సమస్య కూడా రాలేదు. ట్రాయ్ కేసీ చాలాఫిట్‌గా హెల్తీగా ఉన్నాడు. మీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటిని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన మూత్రాన్ని తానే తాగుతానని ట్రాయ్ కేసీ చెప్పాడు. అదే అతని హెల్త్ సీక్రెట్ అట. రోజు ఉదయాన్నే విసర్జించే యూరిన్ స్టోర్ చేసుకుంటాడు ట్రాయ్‌కేసీ. దాన్ని రెండుమూడు వారాలపాటు కిణ్వ ప్రక్రియ ద్వారా నిల్వ చేసి తాగుతాడట. 

యూరిన్‌లో మూల కణాలు, అమైనో ఆమ్లాలు, యాంటీబాడీలు ఉంటాయని ట్రాయ్ కేసీ చెబుతున్నాడు. అలాంటి మూత్రం తాగితే మీ కడుపులో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలుస్తోందని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ట్రాయ్ కేసీని ది సర్టిఫైడ్ హెల్త్ నట్ అని కూడా పిలుస్తారు. అతను ఈ అలవాటు బ్రీత్ వర్క్ కోచ్ నేర్చుకున్నాడట. క్యాన్సర్‌కు కీమోథెరపీని ప్రయత్నించినప్పటికీ తగ్గలేదు. తర్వాత యూరిన్ లూపింగ్ ద్వారా తనను తాను నయం చేసుకున్నానని పేర్కొన్నాడు. యూరిన్ లూపింగ్ అంటే కొన్నిరోజులపాటు వాటర్‌తోపాటు వారి మూత్రాన్ని వారే తాగే ప్రక్రియ. 

20 ఏళ్లుగా అతను యూరిన్ లూపింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు అది ఆయన రోజువారి అలవాటుగా మరింది. టాయిలెట్‌కు పోయి యూరిన్ విసర్జించే సమయంలో ముందు కొంచెం మూత్రాన్ని విసర్జించి.. మధ్యలో భాగాన్ని ఆయన తాగడానికి ఉపయోగిస్తాడు. ఇలా చేయడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొస్తు్న్నాడు. అంతేకాదు అతను దాన్ని ఉదయాన్నే స్నానం చేసే ముందు శరీరానికి రాసుకుంటానని కూడా చెబుతున్నాడు.

కానీ డాక్టర్లు, న్యూట్రీషన్లు మాత్రం ట్రాయ్‌కేసీ విధానంతో తీవ్రంగా విభేదిస్తున్నారు. యూరిన్ అంటే శరీరం వదిలించుకేనే పూర్తి వ్యర్థపదార్థాలని డాక్టర్ మైఖేల్ అజీజ్ అంటున్నారు. మూత్రంలో ఎక్కువగా నీరు, ఉప్పు ఉంటాయి, ఇది మిమ్మల్ని నిర్జలీకరణం చేస్తుంది. మూత్రపిండాలు మీ శరీరంలోని విషాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మీరు మళ్లీ ఆ విషాన్ని తాగితే తిరిగి ఒంట్లోకి పాయిజన్ ఎక్కించినట్లే అవుతుందని అన్నారు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో యూరిన్‌లో E. coli వంటి బ్యాక్టీరియా ఉంటుంది. దానిని తాగితే తీవ్రమైన అనారోగ్యం కలుగుతుందని ఆయన వివరించారు. యూరిన్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోకి విష ప్రయోగం చేస్తున్నట్లే అని చెప్పారు. అయితే మార్నింగ్ చేసే యూరిన్‌లో మెలటోనిన్ మాత్రం ఉంటుందని ఆయన చెప్పారు. ఇది మీ మెంటల్ హెల్త్, నిద్రను కాపాడుతుందని డాక్టర్ మైఖేల్ అజీజ్ అన్నారు. అయినా సరే యూరిన్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన చెబుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు