Rape case: రైల్వే స్టేషన్‌లో ఘోరం.. బావ ముందే మరదలిపై అత్యాచారం!

కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది. కెఆర్ పురం రైల్వేస్టేషన్‌ సమీపంలో బీహార్ వెళ్తున్న యువతిపై అత్యాచారం జరిగింది. ఫుడ్ కోసం మామ కొడుకుతో కలిసి హోటల్ వెళ్తుండగా ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులు ఆసిఫ్, ముషార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
adilabad crime news

Karnataka KR Puram railway station Young woman raped

Rape case: కర్ణాటకలో మరో దారుణం చోటుచేసుకుంది. కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో సమీపంలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మామ కొడుకుతో కలిసి స్టేషన్‌కు వచ్చిన అమ్మాయిపై ఇద్దరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇద్దరినీ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బాధితురాలితో వచ్చిన యువకుడిని ఒక వ్యక్తి అదిమిపట్టుకోగా మరో వ్యక్తి యువతిని రేప్ చేయడం కలకలం రేపింది. స్థానికులు నిందితులలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

తెల్లవారుజామున 1:30 గంటలకు..

ఈ మేరకు బాధితురాలు కేరళలో పనిచేసి బీహార్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్తోంది. ఆమె తన మామ కొడుకుతో కలిసి ఏప్రిల్ 2న తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్ లో దిగింది. ఆహారం తినడానికి మహాదేవపురానికి వెళ్తుండగా స్టేషన్ బయట ఉన్న ఇద్దరు వ్యక్తులు వారిని బలవంతంగా ఆపడంతో వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నిందితుల్లో ఒకరు ఆ అబ్బాయిని బలవంతంగా అదిమిపట్టుకోగా ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఒకరు అత్యాచారం చేశారు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వగానే ఘటన స్థలానికి చేరుకుని నిందితులు ఆసిఫ్, సయ్యద్ ముషార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిందితులు ఇద్దరూ కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ముల్బాగిలు నివాసితులగా గుర్తించారు. ఇప్పటికే ఆసిఫ్ పై అత్యాచారం ఆరోపణలు ఉన్నాయని డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!

ఇదిలా ఉంటే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలతో రక్సెల్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ వెళ్తుండగా దారుణం జరిగింది. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అర్థరాత్రి 2 గంటలకు పెద్ద కూతురు (12) వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఆమె వెనుక వెళ్లిన ఓ వ్యక్తి ఒక అరగంటపాటు ఆమెను బంధించి వేధించాడు. వాటిని మొబైల్ ఫోన్‌లో కూడా చిత్రీకరించాడు. అతను వదిలిపెట్టిన తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు రైల్వే టోల్‌ఫ్రీ నంబరు 139కి ఫోన్‌ చేసి కంప్లైట్ చేశారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

 karnataka | railway-station | rape-case | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు