Waqf Bill: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ

వర్ఫ్ బోర్డు బిల్లును న్యాయస్థానంలో సవాలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లు 2025 లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

New Update
jairam ramesh

jairam ramesh

Waqf Bill: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 బుధవారం లోక్‌సభలో, గురువారం రోజు రాజ్యసభలో అమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. కేంద్ర మైనార్టీ సంక్షమ శాఖమంత్రి కిరణ్ రిజుజి ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం పెడితే ఇక చట్టంగా మరునుంది.  బీజేపీ స‌ర్కారు తెచ్చిన వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లును సుప్రీంకోర్టులో స‌వాల్ చేయ‌నున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. 

Also read: హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు.. జడ్జికి ఫోన్ చేసి బెదిరింపు

సుప్రీంలో కేసు..

వక్ఫ్ బోర్టు బిల్లుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లనున్నట్లు మార్చి 4న కాంగ్రెస్ పార్టీ నేత జ‌య‌రాం ర‌మేశ్ తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ బద్దతను ప్రశ్నిస్తోందని, ఇండియాలో మైనార్టీలైన ముస్లీంల హక్కులను హరించి వేస్తోందని ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. 2019లో ప్రభుత్వం తెచ్చిన సీఏఏను సుప్రీంలో స‌వాల్ చేశామ‌ని, 2005 ఆర్టీఐ చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ను ప్రశ్నిస్తూ సుప్రీంలో స‌వాల్ చేశామ‌న్నారు. ఎన్నిక‌ల నిర్వహ‌ణ అంశంపై తెచ్చిన స‌వ‌ర‌ణ‌ల‌ను ప్రశ్నిస్తూ కూడా సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ కేసు ఫైట్ చేస్తోంద‌న్నారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చ‌ట్టం అమ‌లను నిల‌దీస్తూ కూడా సుప్రీంలో కేసు వేశామ‌న్నారు.

Advertisment
తాజా కథనాలు