/rtv/media/media_files/2025/04/22/D9J8BZgoKiPJXdkSJVug.jpg)
khammam Photograph: (khammam)
Khammam: ఖమ్మం జిల్లా పాల్వంచలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దమ్మతల్లి పాలకమండలి ప్రమాణ స్వీకారంలో భట్టి, పొంగులేటి అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామానికి పాలకమండలిలో చోటుకల్పించలేదంటూ కేశవాపురం యువకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
Also Read: Jwala Gutta :పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ క్రీడాకారిణి గుత్తాజ్వాల!
భారీగా మోహరించిన పోలీసులు..
ఈ క్రమంలోనే పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తూ ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకోగా.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రమాణస్వీకారం చేశారు పాలకమండలి సభ్యులు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
మొదట డిప్యుటీ సీఎం భట్టివిక్రమార్క అనుచరుడు జమ్ముల రాజశేఖర్ ను ఆలయ చైర్మన్ గా నియమిస్తూ సభ్యులతో కూడిన నియామకపత్రం విడుదల చేసింది దేవాదాయ ధర్మాధాయ శాఖ. అయితే ఇటీవల పాలకమండలిలో చోటు దక్కించుకుని ప్రమాణ స్వీకారానికి సిద్ధమైంది పొంగులేటి వర్గం. అయినప్పటికీ నూతన పాలకమండలి జాబితాలో తమ గ్రామానికి చోటుకల్పించకపోవడంపై కేశవాపురం గ్రామస్థులు కొద్దిరోజులుగా ఆందోళనకుదిగారు. తమ గ్రామంలో వెలసిన అమ్మవారి ఆలయ పాలకమండలిలో ఊరికి అవమానం జరిగిందంటూ నిరసనలు చేప్టటారు. ఇందులో భాగంగానే ఈరోజు పాలకమండలి ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారీ బందోబస్తుతో పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి ప్రమాణస్వీకారం ముగిసింది.
Also Read: 'కింగ్‌డమ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ లోడింగ్..!
palvancha | batti | ponguleti | temple | telugu-news | today telugu news