/rtv/media/media_files/VGGcPAyJZGfLN7buYp9j.jpg)
Telangana liquor shops tenders
తెలంగాణ(Telangana) లో మద్యం షాపుల లెసెన్స్(Liquor Shops License)గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మద్యం షాపులకు టెండర్లను ఆహ్వానిస్తూనే దరఖాస్తు పీజును పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట జనాభా ప్రాతిపదికన మద్యం షాపులకు లైసెన్స్ ఫీజును నిర్ణయించినట్లు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్స్‌లు ఈ ఏడాది నవంబర్ 30న ముగియనున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగా లైసెన్స్ ఫీజును నిర్ణయించింది.
ఇది కూడా చూడండి:కవితకు ఊహించని షాకిచ్చిన కేసీఆర్.. ఆ పదవి నుంచి ఔట్!
Liquor Shops License Fees
రానున్న టెండర్లలో మద్యం షాపులు(liquor-shops-tenders-last-date-in-telangana) దక్కించుకున్నవారికి డిసెంబర్ 1, 2025 నుంచి నవంబర్ 10, 2027 వరకు లైసెన్స్ కాలం ఉంటుంది. అలాగు దరఖాస్తు పీజును కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐదు వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో వైన్స్ షాపు లైసెన్స్ ఫీజు రూ. 50 లక్షలుగా ఎక్సైజ్ శాఖ ఖరారు చేసింది. 5 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో.. రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 60 లక్షలుగా నిర్ణయించారు. లక్ష నుంచి ఐదు లక్షల జనాభా ఉంటే.. లైసెన్స్ ఫీజు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో రూ. కోటి పది లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్ణయించినట్లు ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.
ఇక మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్‌ను అమలు చేయనుంది. ఈ కేటాయింపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు.. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తుదారుడు ఆయా వైన్స్‌లకు ఒక్కటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. దుకాణాల లైసెన్సులను వార్షిక ఎక్సైజ్ పన్ను ఆధారంగా లాటరీ ద్వారా కేటాయించే అవకాశం ఉంది.
ఇక లాటరీ ద్వారా దుకాణాలను పొందినవారు వార్షిక లైసెన్స్ రుసుమును ఆరు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 25 నెలల లైసెన్స్ కాలానికి గాను, పావు వంతు (25 శాతం)కు సమానమైన బ్యాంక్ గ్యారెంటీని ప్రభుత్వానికి సమర్పించాలి. జీహెచ్‌ఎంసీ, నగర పంచాయతీ పరిధిలో మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతి ఇవ్వనున్నారు.
Also Read: Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ