Kavita: పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత నెక్స్ట్ ప్లాన్ అదేనా ?

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను కేసీఆర్‌ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కవిత నెక్స్ట్‌స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
Kavita

Kavita

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను కేసీఆర్‌ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా ఆమె ప్రవర్తిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కవిత నెక్స్ట్‌స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆమె తన ఎమెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. తనపై శాసనమండలికి BRS ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ పదవి వదులుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.   

Also Read: కవితపై కేసీఆర్ కోపానికి 5 ప్రధాన కారణాలివే!

ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆఫీస్‌ వద్దకు కవిత మద్దతుదారులు భారీగా చేరుకున్నారు. ఆమెను సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంఘీభావం ప్రకటించారు. జై కవితక్క, జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో కవిత ఫ్లెక్సీని బీఆర్ఎస్‌ శ్రేణులు తగలబెట్టారు. హరీశ్‌ రావుపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనలు చేశారు. బీజేపీ నాయకులకు కవిత అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: బిడ్డనైనా వదిలిపెట్టా.. కేసీఆర్ ఓల్డ్ వీడియో వైరల్!

కవిత ఇప్పుడు ఏం చేయనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఆమె కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం నడుస్తోంది. అలాగే బీసీల అంశమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (TBRS) పేరును కూడా కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగే బీఆర్‌ఎస్‌ పాత పార్టీ పేరైన.. టీఆర్‌ఎస్‌ పేరును కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయని మరికొందరు అంటున్నారు. 

ఒకవేళ కవిత కొత్త పార్టీ పెడితే ఆమె వెంట వచ్చేందుకు ప్రజాధారణ ఉన్న కీలక నేతలు ఎవరూ లేరు. దీంతో పార్టీని ముందుకు నడిపించేందుకు ఆమెనే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎవరైన నేతలు ఆమె పార్టీలో చేరే అవకాశమూ లేకపోలేదు. కవిత పార్టీ ఎజెండా అంశాలు ఏంటనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందే కవిత కొత్త పార్టీని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లాభం జరుగుతుందా ? లేదా నష్టం ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. 

Also Read: డిగ్రీ అర్హతతో 13217 ఉద్యోగాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు - పూర్తి వివరాలివే

చాలావరకు బీఆర్ఎస్‌ శ్రేణులు కేసీఆర్‌ తీసుకుంది సరైన నిర్ణయమేనని భావిస్తున్నారు. కవిత మద్దతుదారులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమెకు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారు. మంగళవారం కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ ఆమె నిజంగానే ఇలా రాజీనామా చేస్తే.. పార్టీ పెట్టడం ఖాయమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరి ఆమె సొంతంగా రాజకీయాల్లో ఏ విధంగా రాణిస్తుందో చూడాలంటే మరిన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

Advertisment
తాజా కథనాలు