/rtv/media/media_files/2025/09/02/ibps-rrb-notification-2025-2025-09-02-14-27-42.jpg)
IBPS RRB Notification 2025
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో అంటే RRBలలో భారీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 13,217 క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్), ఆఫీసర్ స్కేల్-I, II, III పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Also Read: కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ RRB PO, క్లర్క్ 2025 పోస్టుల దరఖాస్తుకు సెప్టెంబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు:
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్): 7,972 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3,907 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 967 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-II (స్పెషలిస్ట్ ఆఫీసర్స్): 117 పోస్టులు
ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్): 254 పోస్టులు
ఇలా మొత్తం 13,217 పోస్టులపై నియామకాలు జరుగుతున్నాయి.
Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు
అర్హతలు:
ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
ఆఫీసర్ స్కేల్ I: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
ఆఫీసర్ స్కేల్ II (జనరలిస్ట్): బ్యాచిలర్ డిగ్రీ మరియు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం.
ఆఫీసర్ స్కేల్ II (స్పెషలిస్ట్): స్పెషలిస్ట్ పోస్టును బట్టి సంబంధిత అర్హతలు (ఉదా. ఐటీ, వ్యవసాయం).
ఆఫీసర్ స్కేల్ III: బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలో కనీసం 5 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ.
Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్
వయస్సు పరిమితి (సెప్టెంబర్ 1, 2025 నాటికి):
ఆఫీస్ అసిస్టెంట్: 18 - 28 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్-I: 18 - 30 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్-II: 21 - 32 సంవత్సరాలు
ఆఫీసర్ స్కేల్-III: 21 - 40 సంవత్సరాలు
వయో సడలింపు: ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ www.ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ. 175.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 1, 2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2025
ప్రిలిమినరీ పరీక్ష (ఆఫీసర్ స్కేల్-I, ఆఫీస్ అసిస్టెంట్): డిసెంబర్ 2025
మెయిన్స్/సింగిల్ ఆన్‌లైన్ పరీక్ష: జనవరి/ఫిబ్రవరి 2026