/rtv/media/media_files/2025/09/15/bandi-sanjay-2025-09-15-18-49-50.jpg)
కరీంనగర్ కార్పొరేషన్(karimnagar corporation) మేయర్ ఎన్నికలో కొత్త ట్విస్ట్ నెలకొంది. మేయర్ పదవి సొంతం చేసుకుందామనుకుంటున్న కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి అంచనాలకు తారుమారు చేశారు. కరీనంగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా, బీజేపీ 30 డివిజన్లను గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 డివిజన్లు గెలుచుకున్నాయి. శుక్రవారం రాత్రి ఇద్దరు, శనివారం ఉదయం ఇద్దరు బీజేపీలో చేరారు. స్థానిక ఎంపీగా బండి సంజయ్(Bandi Sanjay) ఎక్స్ అఫీషియో ఓటు కలుపుకొని మొత్తం 35 ఓట్లు బీజేపీ వద్ద ఉన్నాయి. శనివారం రాత్రే గెలిచిన కార్పొరేటర్లను సంజయ్ హైదరాబాద్ క్యాంపునకు తరలించారు. అదే సమయంలో కరీంనగర్ కేంద్రంగా మరో రాజకీయానికి తెరలేచింది.
Also Read : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. వారి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
మేయర్ పీఠం కాంగ్రెస్‌కు దక్కాలని..!
కరీంనగర్ మేయర్ పీఠం ఎలాగైనా కాంగ్రెస్‌కు దక్కాలని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్రావు ఈ ఎన్నిక(Municipal Elections Results 2026) ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌కు చెందిన 14 మంది కార్పొరేటర్లను క్యాంపునకు తరలించారు. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్లకు నేతృత్వం వహిస్తున్న సౌగాని కొమురయ్యతో కాంగ్రెస్ చర్చలు సఫలమయ్యాయి. మరోవైపు తమ పార్టీ నుంచి గెలిచిన 9 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్‌కు తరలించారు. తమకు ఎవరు మేయర్ పీఠం అప్పజెబితే వారికే మద్దతిస్తామని కమలాకర్ స్పష్టం చేస్తున్నారు. దీంతో మేయర్ పదవి బీజేపీ వశమవకుండా ఈ నేతలంతా ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. అనంతరం కరీంనగర్ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకుపోయారు. ప్రస్తుతం ఈ విషయాన్ని సీఎం వ్యక్తిగత సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read : మహబూబ్ నగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ.. చీరాల బీచ్‌కు అభ్యర్థుల బృందం
Follow Us