/rtv/media/media_files/2026/02/14/bandi-sanjay-2026-02-14-11-33-10.jpg)
కరీంనగర్(karimnagar) కార్పొరేషన్‌లో కలమం వికసించింది. అక్కడి మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చాయి. మొత్తం 66 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తొలుత హంగ్ ఏర్పడింది. అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తన రాజకీయ చతురతతో రాత్రికి రాత్రే సమీకరణాలను మార్చేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులను బీజేపీలోకి చేర్చుకోవడంతో ఆ పార్టీ బలం 35కి చేరి మెజారిటీ మార్కును దాటింది. ఇంకా మరికొందరు స్వతంత్రులు కూడా కమలం గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర బీజేపీలో బండికి క్రేజ్ పెరగనుంది.
Also Read : ఎంపీ, MLCలకు ఎన్నికల సంఘం బిగ్ షాక్.. వారికి ఎక్స్ అఫీషియో ఓటు లేనట్టే!
బండి ఆడించే ఆట..
పార్టీలో పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకునే ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ మార్క్ ఎక్కడా చూపించలేకపోయారు. అధ్యక్ష పదవికి పోటి పడ్డ వారు కూడా వారి సొంత నియోజకవర్గాల్లో కొంత మేరకు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఏడాది క్రితమే అప్పటి కరీంనగర్ మేయర్ సునీల్ రావుని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి తీసుకొచ్చారు బండి సంజయ్(bandi-sajnay-kumar). అప్పుడు 10 మంది కార్పొరేటర్లు కూడా బీజేపీలోకి గుంజారు. 2005 నుంచి మున్సిపల్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచిన బండి సంజయ్‌కు ఈ ఆట కొట్టిన పిండి. కరీంనగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బండి.. ఇప్పుడు మేయర్‌నే డిసైడ్ చేసేలా ఎదిగారు. ఇదే కదా సక్సెస్ అంటే.. గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉండి GHMCఎన్నికల్లో కూడా కమలాన్ని పరుగుపెట్టించారు. 2020 హైదరాబాద్ GHMC ఎన్నికల్లో బీజేపీ క్రేజ్ అమాంతం పెంచారు ఆయన. 48 మంది కార్పొరేటర్లను కమలం పార్టీ నుంచి గెలించారు. దీన్నిబట్టి చూస్తే ఆయనకు లోకల్ పాలిటిక్స్‌పై మంచి గ్రిప్ ఉన్నట్లు అర్ధమవుతుంది. తెలంగాణలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత చాలాచోట్ల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కరీంనగర్‌లో ముఖ్యమైన నాయకులను కమలం గూటికి చేరారు. దానికి కారణం బండి సంజయ్ తిప్పిన రాజకీయ చక్రమే.
మున్సిపల్ ఎన్నికల కోసం అప్పటి నుంచే ఆయన గ్రౌండ్ క్రియేట్ చేశారు. దీంతో బీజేపీ ఎక్కువ వార్డులు గెలిచింది. అధికార పక్షంలో ఉన్నా కాంగ్రెస్ 14 స్థానాలతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది. ఇక MIM 3 చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు 5 గెలిచారు. రాష్ట్రవ్యాప్తం ఉన్న రిజల్ట్ కరీంనగర్‌లో వచ్చిన ఫలితాలకు ఉల్టా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు పోటీ బీఆర్ఎస్ ఇస్తే.. ఇక్కడ మాత్రం బీజేపీ ఏకంగా కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.
Also Read : మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయానికి కారణమైన అంశాలు:
బండి సంజయ్ అనుసరించిన 'హిందుత్వ ఎజెండా' ఇక్కడ పూర్తిస్థాయిలో ఫలించింది. కాంగ్రెస్, మజ్లిస్ రెండు ఒక్కటేనంటూ ఆయన చేసిన ప్రచారం ఓటర్లపై బలమైన ప్రభావం చూపింది. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉన్న సమన్వయ లోపం బీజేపీకి వరంగా మారింది. గతంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ఈసారి ఘోరంగా విఫలమైంది. గతంలో 33 స్థానాలు ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. అటు మజ్లిస్ బలం కూడా 6 నుంచి 3కి పడిపోయింది. మొత్తానికి కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us