Huzurabad : కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్ లో కాంగ్రెస్ విజయం

ఎప్పడు వివాదాల్లో ఉండే Huzurabad బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగురవేసింది.

New Update
MLA Padi Kaushik Reddy

MLA Padi Kaushik Reddy

Huzurabad :  ఎప్పడు వివాదాల్లో ఉండే Huzurabad బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజక వర్గంలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగురవేసింది. మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా, 16 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం  8 వార్డులకే పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ (BJP) 5 స్థానాల్లో విజయం సాధించింది మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపించింది. మొత్తం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేయగా, బీఆర్ఎస్ కేవలం 8 స్థానాలకే పరిమితమై అధికార పార్టీకి పెద్దగా పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించి విజయం సాధించిన కౌశిక్ రెడ్డి వ్యూహాలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం పారకపోవడంతో బీఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. కౌశిక్ రెడ్డి చేసిన హడావుడి, గెలుపుపై ధీమా అన్నీ నీటి మూటలయ్యాయి. వార్డుల వారీగా ప్రజల మద్ధతు  సాధించడంలో ఆయన వైఫల్యం చెందారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే బీజేపీ నేత ఈటల రాజేందర్ కు కూడా ఇక్కడ ఎదురు గాలి వీచింది. హుజురాబాద్ లో తన వర్గీయులను బరిలోకి దింపినప్పటికీ, అక్కడ కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. బిజెపి కేవలం 5 వార్డుల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఒకప్పుడు ఈటల కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో బిజెపి మూడో స్థానానికి పరిమితం కావడం చర్చనీయంశంగా మారింది. అటు కౌశిక్ రెడ్డికి, ఇటు ఈటలకు షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ మున్సిపాలిటీపై జెండా ఎగురవేయడం గమనార్హం

Advertisment
తాజా కథనాలు