కరీంనగర్‌లొ కమలం జోరు.. కాంగ్రెస్, BRSని వెనక్కి నెట్టిన బీజేపీ

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 వార్డులు ఉండగా.. ఓట్ల లెక్కింపు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు BJP స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆ పార్టీ ఇప్పటికే 28 వార్డులలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ఉంది.

New Update
sanjay

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొత్తం 66 వార్డులున్న ఈ కార్పొరేషన్‌లో ఓట్ల లెక్కింపు శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, BJP స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతోంది. ఆ పార్టీ ఇప్పటికే 28 వార్డులలో విజయం సాధించి లేదా ముందంజలో ఉండి అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా ఉంది.

ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపుతుండగా, గతంలో బలంగా ఉన్న BRS ఈసారి 13 స్థానాలకే పరిమితమై మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇతరులు/స్వతంత్రులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, ఇక్కడ బీజేపీ సాధిస్తున్న ఫలితాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడితేనే మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది స్పష్టమవుతుంది. అయితే, ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే కరీంనగర్‌లో బీజేపీ జెండా ఎగురవేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు