Bandi Sanjay: కాంగ్రెస్, BRS, MIM పార్టీలకు బండి సంజయ్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ వాలంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని ఎద్దేవా చేశారు.

New Update
bandi-sanjay counter

bandi-sanjay counter

కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) వాలంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి ఈ పార్టీలన్నీ లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.

Also Read :  ఎంపీ, MLCలకు ఎన్నికల సంఘం బిగ్ షాక్.. వారికి ఎక్స్ అఫీషియో ఓటు లేనట్టే!

Bandi Sanjay Valentines Day Wishes to Congress-BRS-MIM

కరీంనగర్‌(karimnagar-bjp-mp) లో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటిందని, స్వతంత్ర అభ్యర్థులు కూడా తమకే మద్దతు ఇస్తున్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే, బీజేపీ మేయర్ కాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చర్చలు జరుపుతున్నారని మండిపడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే రంగంలోకి దిగి బిఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్లు చేయిస్తున్నారని వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మేయర్ పీఠం కోసం ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలది ఎంసిల్ బంధం అని, ఈ రెండింటినీ అతికించడానికి ఎంఐఎం పార్టీ మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఎంఐఎంను ఎనిమిది స్థానాల నుండి మూడు స్థానాలకు పరిమితం చేశామని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. బీజేపీ కష్టపడి పని చేస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా తమ ఓటింగ్ శాతం పెరిగిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read :  మంత్రి పదవి ఇవ్వకుంటే డైరెక్ట్ సీఎం అవుతా.. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డిపై హెచ్చరిక:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(bandi sanjay fire on cm revanth) గనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే, ఆయనపై యుద్ధం ప్రకటిస్తానని బండి సంజయ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై లక్షలాది మందితో రోడ్లపైకి వచ్చి నిలదీస్తామని చెప్పారు. పెన్షనర్లు, ఇతర బాధితులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సెగ తగిలిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పంథాను కొనసాగిస్తామని, నగరాన్ని ముక్కలు చేసి ఎంఐఎంకు రాసిచ్చే కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు