/rtv/media/media_files/2026/02/13/fotojet-5-2026-02-13-19-39-07.jpg)
BRS suffers a crushing defeat in Peddapalli district.
BRS : పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో భారీగా మున్సిపాలిటీలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో పలుజిల్లాల్లో పూర్తిగా సతికిల పడింది. కాగా పెద్దపల్లి జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉండగా ఏ ఒక్కదానిలోనూ విజయం సాధించలేకపోయింది. జిల్లాకు చెందిన మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు(it minister duddilla sridhar babu) జిల్లాలో చక్రం తిప్పడంతో జిల్లాలో బీఆర్ఎస్ సతికిల పడింది. అటు రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నేతృత్వంలో రామగుండం కార్పొరేషన్ తో పాటు మంథని(manthani), పెద్దపల్లి, సుల్తానాబాద్(sulthanabad) మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. రామగుండం కార్పొరేషన్(Ramagundam Municipal Corporation) లో మొత్తం 60 డివిజన్లు ఉండగా బీఆర్ఎస్ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. రామగుండం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటిచందర్ శాయశక్తుల ప్రయత్నించినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయం సాధించకలేకపోయింది. స్థానిక ఎమ్మెల్యేపైన పలు ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. కొంతలో కొంత మెరుగ్గా 13 స్థానాలతో డబుల్ డిజిట్ రావడం కోరుకంటి చందర్ కు, బీఆర్ఎస్ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశంగానే చెప్పుకోవాలి.
Also Read : ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
BRS Defeat In Peddapalli District
ఇక పోతే మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ అదికూడా కేవలం ఒకే ఒక స్థానంలో విజయం సాధించడం ఆ పార్టీ జిల్లాలో బలహీనపడిందని చెప్పడానికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఒకపుడు ఈ మూడు నియోజకవర్గాలు, కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతిలో ఉండగా తాజాగా కనీసం సంఖ్యలో అభ్యర్థులను గెలిపించుకోలేని పరిస్థితి నెలకొనడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతుంది. మంథని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీచైర్మన్ పుట్టమధు తన సొంత ఇలాకాలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. ఇక్కడ జిల్లా మంత్రి శ్రీధర్ బాబుది కూడా మంథని కావడం ఈ ఎన్నికల్లో పార్టీ అధికారంలో ఉండటం, ఆయన మంత్రిగా ఉండటంతో విజయం సునాయాసమైందని చెప్పచ్చు.
పెద్దపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మె్ల్యే దాసరి మనోహర్ రెడ్డి పరిధిలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉండగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపలేకపోయింది. కాగా, గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మనోహర్ రెడ్డి పార్టీ తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడనే ప్రచారం ఉంది. అందుకే ఆయన ఈ ఎన్నికల పై అంతగా దృష్టిసారించలేదని స్థానికులు అంటున్నారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మె్ల్యే విజయరమణారావు రెండు మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించడం కోసం శాయశక్తుల కృషి చేయడం అందుకు తగ్గ ఫలితం దక్కడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ జిల్లాలో ఉనికి కోల్పొయే ప్రమాదం ఉందని ఆ పార్టీ అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Also Read : చక్రం తిప్పిన గూడెం మహిపాల్ రెడ్డి.. ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ హవా
Follow Us