/rtv/media/media_files/2025/05/17/qn8KtWdYQt6emmDRYqa2.jpg)
Indian Army
దేశం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న సైనికులకు సొంత గ్రామంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. తమకున్న భూమిని ఎవరో ఒకరు కబ్జా చేస్తుండటంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై ఆయన ఎన్నిసార్లు మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయింది.
ఇది కూడా చూడండి: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!
Requested @Collector_SDPT Garu to investigate the matter and take necessary action. It's appalling that a soldier safeguarding our borders faced such an incident. https://t.co/3krAztih5D
— Harish Rao Thanneeru (@BRSHarish) May 17, 2025
ఇది కూడా చూడండి: Oppo Reno 14 5G Series: కిర్రాక్ మావా.. అప్పు చేసైనా ఒప్పో కొనేయాల్సిందే - ఫోన్లు అదిరిపోయాయ్!
ట్విస్ట్ ఏంటంటే..
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జవాన్ భూమిని కబ్జా చేసింది స్వయంగా స్థానిక వీఆర్వో సోదరుడే కావడం గమనార్హం. ఈ విషయంపై ఆ జవాన్ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆర్డీవో, కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో తీసి ఆ జవాన్ పోస్టు చేయడందో అది కాస్తా వైరల్‌గా మారింది. నా భూమిని కబ్జా చేశారు. నన్ను, నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు, తన భూమి తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆ వీడియోలో వేడుకుంటున్నారు. తాను దేశ సరిహద్దుల్లో పోరాడుతుంటే, సొంత ఊరిలో నా భూమి కబ్జా చేయడం దారుణమని రామస్వామి ఆవేదన చెందారు. దయచేసి తమకు న్యాయం చేయాలని రోధిస్తుంచారు. కాగాఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చూడండి: Pre-Diabetes: ప్రీడయాబెటిస్, ఊబకాయం ఉన్నవారు కొన్ని పండ్లను ఎందుకు నియంత్రణలో తినాలి
తాజాగా ఆ వీడియో ఈ వ్యవహారంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘ఈ విషయంపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్‌ను అభ్యర్థించారు. మన సరిహద్దులను కాపాడుతున్న ఒక సైనికుడికి ఇలాంటి సంఘటన ఎదురవడం దారుణం’ అని హరీష్ రావు పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Russia-Ukraine: రష్యా వీలు కాని డిమాండ్లు పెడుతోంది.. ఉక్రెయిన్ ఆరోపణ
Indian Army | army-jawan | jawan | army-jawans | siddipet | mla-harish-rao | Indian Soldier Land Encroachment Case