/rtv/media/media_files/2025/05/16/UeZXvdqFGjoLShpopGcs.jpg)
Oppo Reno 14 5G Series
టెక్ బ్రాండ్ ఒప్పో మరో రెండు ఫోన్లను లాంచ్ చేసింది. Oppo Reno 14 5G, Oppo Reno 14 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌లు అందించారు. ఇవి 6,200mAh బ్యాటరీతో వస్తాయి. రెండు ఫోన్‌లలో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కంపెనీ మద్దతు ఇచ్చింది. వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పై నడుస్తాయి. Oppo Reno 14 సిరీస్‌లో కంపెనీ IP66+IP68+IP69 రేటింగ్ ఇచ్చింది.
Oppo Reno 14 5G Price
ఒప్పో రెనో 14 5G ధర 12GB + 256GB వేరియంట్ సుమారు రూ. 33,200 నుండి ప్రారంభమవుతుంది. 16GB+256GB వేరియంట్ ధర దాదాపు రూ. 35,600గా కంపెనీ నిర్ణయించింది. 16GB+512GB వేరియంట్ ధర దాదాపు రూ. 39,100 గా ఉంది. టాప్ వేరియంట్ 16GB+1TB స్టోరేజ్‌లో వస్తుంది. దీని ధర దాదాపు రూ. 45,100గా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను మెర్మైడ్, పినెల్లా గ్రీన్, రీఫ్ బ్లాక్ కలర్‌లలో విడుదల చేసింది.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
Reno 14 Pro 5G Price
ఒప్పో రెనో 14 ప్రో 5G ప్రారంభ 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ. 41,500గా ఉంది. టాప్ వేరియంట్ 16GB+1TB స్టోరేజ్‌లో వస్తుంది. దీని ధర దాదాపు రూ. 53,400గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ కల్లా లిల్లీ పర్పుల్, మెర్మైడ్, రీఫ్ బ్లాక్ కలర్‌లలో వచ్చింది. ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సేల్ మే 23 నుండి ప్రారంభమవుతుంది.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
స్పెసిఫికేషన్లు
ఒప్పో రెనో 14 5G, రెనో 14 ప్రో 5G ఫోన్లు వరుసగా 6.59 -అంగుళాలు, 6.83-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్ప్లేను కలిగి ఉంటాయి. ఇవి 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తాయి. ఈ రెండింటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8350, మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌లను అందించారు. రెండు ఫోన్‌లలో 16GB RAM, 1TB UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 స్కిన్‌పై పనిచేస్తాయి.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ (OIS) కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ షూటర్ (3.5X ఆప్టికల్ జూమ్), 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బేస్ రెనో 14 5G మోడల్ 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది, ప్రో వేరియంట్ 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఒప్పో రెనో 14 5G వేరియంట్ 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేయగా, ప్రో వేరియంట్ 6,200mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. రెండు ఫోన్‌లు 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లకు IP66+IP68+IP69 రేటింగ్ అందించారు.
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
oppo-reno | oppo-reno-series | latest-telugu-news | telugu-news