Pre-Diabetes: ప్రీడయాబెటిక్ స్థితిలో ఉన్న ఊబకాయం వల్ల శరీరానికి తీవ్రమైన ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నవారు వారి ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా అధిక చక్కెరను కలిగి ఉన్న ఆహార పదార్థాలను తినవద్దు. ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొన్ని రకాల పండ్లను తినడం పట్ల జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇవి సహజంగా తియ్యగా ఉండటంతో శరీరానికి అధిక చక్కెరను అందించగలవు. ఆ పండ్లు ఎంటో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా..
వేసవిలో విరివిగా లభించే లిచీ పండు తియ్యగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కానీ ఒక కప్పు లిచీలో సుమారు 29 గ్రాముల చక్కెర ఉండటంతో ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని వేగంగా పెంచుతుంది. దీనిలో గ్లైసెమిక్ సూచిక కూడా ఎక్కువగా ఉండటంతో ప్రీ-డయాబెటిస్ ఉంటే దీనిని పరిమితంగా తీసుకోవాలి. అలాగే అంజీర్ పండ్లలో ఫైబర్ ఉన్నా, ఎండిన అంజీర్ పండ్లలో దాదాపు 20 గ్రాముల చక్కెర ఉంటుంది. అధిక చక్కెరకు అంజీర్‌ను కారణంగా గుర్తించారు. ఖర్జూరాలు కూడా ఆరోగ్యకరమైనవిగా భావించినా తరచూ తినడం వల్ల గ్లైసెమిక్ లోడ్ పెరగవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ వంటల్లో జీలకర్ర వాడితే డేంజర్...రుచిపోవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా..!
నలుపు, ఆకుపచ్చ, ఎరుపు ద్రాక్షలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది సోడా డబ్బా తాగినంత ప్రభావం కలిగించగలదు. అరటిపండులో చక్కెర 14 గ్రాముల వరకు ఉంటుంది. మామిడిపండులో 45 గ్రాముల చక్కెర, పైనాపిల్ లో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. కాబట్టి ఈ పండ్లను ఆరోగ్యకరంగా భావించినా ప్రీ-డయాబెటిక్ లేదా బరువు తగ్గించే యత్నంలో ఉన్నవారు ఈ పండ్లను తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వంటలలో జీలకర్రను జోడించే ముందు ఆలోచించాల్సిన విషయాలు
(diabetes | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)