ఖమ్మంలో షాకింగ్ ఘటన.. పెళ్లి పేరుతో రూ.40 లక్షలు కొట్టేసిన కిలాడీ!
ఖమ్మం యువకుడికి మ్యాట్రిమోనిలో ఓ యువతి పరిచయమయ్యింది. ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని యువకుడిని ఆశ చూపించింది. యువతిని నమ్మిన యువకుడు రూ.40 లక్షలు అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.