Amoy Kumar: అప్రూవర్‌గా అమోయ్ కుమార్.. పేలనున్న మరో పొలిటికల్ బాంబ్?

రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. మరోవైపు అమోయ్‌కుమార్‌ ఈ కేసులో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది.

New Update
Amoy kumar

ఐఏఎస్‌ అమోయ్‌కుమార్‌కు సంబంధించిన వ్యవహారం రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల అక్రమ బదలాయింపులో అమోయ్ కుమార్ పాత్రపై పూర్తిగా దర్యాప్తు జరిపి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈడీ అధికారులు డీజీపీ జితేందర్‌ను కోరారు. ధరణీని వాడుకోని కేసీఆర్‌ కుటుంబం భూములను దోచుకుందని ఇటీవల మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే త్వరలో పొలిటికల్ బాంబ్ కూడా పేలుస్తామన్నారు. అయితే ఆ పొలిటికల్ బాంబ్ అమోయ్ కుమార్ కేసుకు సంబంధించిందేనని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అమోయ్ కుమార్ కూడా ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్, కేటీఆర్‌, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

Also Read: మోదీకి రేవంత్ వార్నింగ్.. మహారాష్ట్ర ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు!

మనీలాండరింగ్ జరిగింది !

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో 42 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా కట్టబెట్టడంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్‌కుమార్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం డీజీపీ జితేందర్‌ను కలిశారు. ఇందులో అమోయ్‌కుమార్ పాత్రపై పూర్తిగా దర్యాప్తు జరిపి కేసులు నమోదు చేసేలా స్థానిక పోలీసులను ఆదేశించాలని కోరారు. రంగారెడ్డి అలాగే మేడ్చల్ జిల్లాల్లో అమోయ్‌ కుమార్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు భూ లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరపాలని కోరారు.  

Also Read: రోడ్డు మీద ఉమ్మివేస్తున్నారా జాగ్రత్తా.. వారి కంటపడితే ఖతమే!

పలువురు బాధితులు ఇప్పటికే చేసిన 12 ఫిర్యాదుల వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగారం భూదాన్ భూముల విషయంలో వివరాలు అడిగినా కూడా పోలీసులు స్పందించలేదని ఈడీ అధికారులు డీజీపీకి చెప్పారు. తమ విచారణలో ప్రాథమికంగా లభించిన ఆధారాలను డీజీపీకి సమర్పించారు. అయితే  ఈడీ అధికారులు డీజీపీని కలిసి వివరాలు ఇవ్వడం చర్చనీయం అవుతోంది. వాస్తవానికి పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేస్తుంటారు. అలాగే ఈ కేసుల వివరాల సేకరణ ప్రక్రియ అంతా కూడా ఉత్తరప్రత్యుత్తరాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Green Tea: ఉదయాన్నే గ్రీన్ టీ తాగేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

కేసీఆర్‌, కేటీఆర్‌కు షాక్ తప్పదా ?

అయితే ఈడీ బృందం నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేయడం చాలా అరుదు. ఇప్పటిదాకా అమోయ్‌కుమార్‌పై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకపోవడం వల్ల ఈడీ దర్యాప్తునకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు నమోదు చేసే ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా విచారణలో ముందుకెళ్లే యోచనతో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం దృష్ట్యా అమోయ్‌కుమార్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరీ ఈ కేసు వ్యవహారం ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తోంది ? దీనివెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరున్నారు, కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు ఇతర కీలక నేతలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా అనేదానిపై రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబ్‌ పేలే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: ఇక్కడ చేసిన ఫుడ్ తిన్నారో.. ఒక్కసారికే పైకి పోవడం గ్యారెంటీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు