Kota: కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం.. సతీమణి కన్నుమూత!

దివంగత కోట శ్రీనివాసరావు ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి హైదరాబాద్‌లోని ఇంట్లో కన్నుమూశారు. అయితే ఇటీవల కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.

New Update
kOTA SRINIVAS RAO WIFE

kOTA SRINIVAS RAO WIFE

దివంగత కోట శ్రీనివాసరావు(Actor Kota Srinivasa Rao) ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రుక్మిణి(Rukmini) హైదరాబాద్‌లోని ఇంట్లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా రాత్రి 1 గంట సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. అయితే జూలై 13న కోట శ్రీనివాస రావు మృతి చెందిన విషయం తెలిసిందే.  భర్త చనిపోయిన 35 రోజులకే భార్య కూడా చనిపోవడంతో కోటా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కోట శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్రీ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని మృతితో సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా కుంగిపోయారు. దాదాపుగా నెల రోజుల్లోనే ఇద్దరూ భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ఇది కూడా చూడండి: Rahul Sipligunj Engagement: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

కుమారుడి మృతితో..

కోటా శ్రీనివాసరావు, రుక్మిణీ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక  కుమారుడు. అయితే 2010లో హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా శోకసంద్రంలోకి మునిగిపోయారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కోటా శ్రీనివాసరావుతో పాటు భార్య రుక్మిణీ ఆరోగ్యం కూడా క్షీణించింది. కొడుకుని తలుచుకుంటూ భార్యాభర్తలు బాధపడేవారు. పలు సందర్భాల్లో కూడా కోట శ్రీనివాస రావు కొడుకును తలచుకుని బాధపడ్డారు. ఎన్నో వందలకు పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాస రావు చివరగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీలో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమా కోట శ్రీనివాస్ రావు మృతి చెందిన తర్వాత రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నటించినందుకు కోట శ్రీనివాస రావు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Rahul Sipligunj Engagement Photos: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశారా.. జోడీ ఎంత బాగుందో?

దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన కోట శ్రీనివాస రావు కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న జన్మించారు. వీటి మీద ఆసక్తితో బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదిలి నటనలో రాణించారు. సినిమాల్లో తన నటనకి గాను కోట శ్రీనివాసరావుకి ఎన్నో అవార్డులు లభించాయి. ఉత్తమ ప్రతినాయకుడు, సహాయ నటుడు, ఉత్తమ నటుడు వంటి వివిధ విభాగాల్లో మొత్తం తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. 1985లో "ప్రతిఘటన" చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు, 1993లో "గాయం"కు ఉత్తమ విలన్, 2004లో "ఆ నలుగురు"కు ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఇలా చాలా సినిమాలకు అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ సైమా అవార్డు దక్కింది. భారతీయ సినిమాకు చేసిన సేవలకు గానూ 2015లో భారత ప్రభుత్వం నుండి దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం "పద్మశ్రీ" అందుకున్నారు.

Advertisment
తాజా కథనాలు