Rahul Sipligunj Engagement: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. హరిణ్యా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు హరిణ్యా రెడ్డి.

New Update
Rahul Sipligunj Engagement

Rahul Sipligunj Engagement

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) హరిణి రెడ్డి(Harini Reddy) అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్న ఈ ఎంగేజ్‌మెంట్‌కి కేవలం కుటుంబ సభ్యులు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ హాజరు అయినట్లు సమాచారం. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు రాహుల్ సిప్లిగంజ్ అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఈ వేడుకకు హాజరైన వారు ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి అనే యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా రిలేషన్‌‌లో వీరిద్దరూ ఉన్నట్లు సమాచారం. అయితే హరిణ్యా వాళ్ల కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి స్వస్థలం నెల్లూరు. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు హరిణ్యా రెడ్డి. అయితే విజయ్ 1985లో సర్వేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

ఇది కూడా చూడండి: Manchu Manoj: కలిసిపోయిన మంచు విష్ణు, మనోజ్.. కొడుకుకి అవార్డు వేళ  'అన్నా' అంటూ పోస్ట్ !

హరిణ్యా తండ్రి ఓ వ్యాపారవేత్త..

రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ తన కంటూ  ప్రత్యేక గుర్తింపును రాహుల్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంటర్ అయి పాటలు పాడి మంచి క్రేజ్ పొందాడు. మాస్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో నాటు నాటు పాట పాడి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. 

ఇది కూడా చూడండి: Rahul Sipligunj Engagement: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. వైరలవుతున్న ఫొటోలు!

హోరాహోరీ పోటీలో గెలిచిన రాహుల్..

ఆస్కార్ వేదికపై పాడటంతో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రాహుల్‌కు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల నగదు అందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.కోటి రూపాయల చెక్‌ను కూడా అందించారు. ఇదిలా ఉండగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3కు కూడా వెళ్లారు. ఈ సీజన్‌లో రాహుల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. చివరలో శ్రీముఖి, రాహుల్ మధ్య పోటీ ఏర్పడింది. అందరూ శ్రీముఖి గెలుస్తుందని భావించారు. కానీ రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. 

Advertisment
తాజా కథనాలు