Pakistan: పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి.. మోదీకి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్!

పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్‌, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. టెర్రర్ అటాక్‌కు వ్యతిరేకంగా కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని.. పాక్‌ని 2 ముక్కలు చేసి POKని ఇండియాలో కలపాలని ప్రధానికి ఆయన సూచించారు.

author-image
By K Mohan
New Update
revanth reddy

revanth reddy Photograph: (revanth reddy)

పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కొవ్వుత్తుల ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ సహా అనేక మంది నాయకులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు శుక్రవారం సాయంత్రం జరిగిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అటాక్‌పై కేంద్రం తీసుకునే చర్యకు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. దీనికి కారణమైన పాకిస్తాన్, టెర్రరిస్ట్ సంస్థకు ధీటైన బదులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసైనా, కఠినమైన చర్య తీసుకోవాలని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌ను 2 ముక్కలు చేసి.. పీవోకేను భారత్‌లో విలీనం చేయాలన్నారు. మేమందరం మీతో నిలబడతామని ప్రధాని మోదీని కోరారు. మీరు దుర్గామాత భక్తుడు. పాక్ కవ్వుంపు చర్యలకు ఇందిరా గాంధీ సమాధానాలను గుర్తు చేసుకోండని ఆయన సూచించారు. పహల్గామ్ వంటి సంఘటనలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజీ పడటానికి సమయం లేదు, తగిన సమాధానం చెప్పాల్సిందే అని ప్రధానిని కోరారు.

(attack in Pahalgam | Jammu and Kashmir | cm-revanth-reddy | pok | candle-rally-under-the-leadership | hyderabad | pakistan | Terror Attack | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు