prakasam: చంద్రబాబు విడుదలయ్యే వరకు సైనికుల్లా పని చేస్తాం: ఎమ్మెల్యే స్వామి
ప్రకాశం జిల్లా నియోజక కేంద్రమైన కొండపిలో చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా ఎమ్మెల్యే స్వామి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువీరు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల వలయాన్ని చేదించుకొని పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.