/rtv/media/media_files/2025/05/13/YTXcWJK9NQOyndMe2z3X.jpg)
Boycott Turkey
టర్కీలో 2023లో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషాద వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో మన భారత్.. టర్కీకి మానవతా సాయం చేసింది. అక్కడివాళ్ల కోసం కావాల్సిన వస్తువులను ప్రత్యేక విమానంలో పంపించింది. కానీ టర్కీ మాత్రం మనపై ఏమాత్రం కనికరం లేకుండా విషం కక్కుతోంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. టర్కీ బహిరంగానే పాకిస్థాన్‌కు మద్దతు తెలిపింది. అంతేకాదు పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేసేందుకు వాడిన డ్రోన్లు కూడా టర్కీకి చెందినవేనని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.
Also Read: అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్
India-Pakistan Tensions
మనం సాయం చేస్తే మనకే వెన్నుపోటు పొడిచిన టర్కీకి ఇప్పడు సోషల్ మీడియాలో నిరసన సెగ తగులుతోంది. బాయ్‌కట్ టర్కీ అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. టర్కీ టూర్లు రద్దు చేసుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ఆ దేశానికి చెందిన వస్తువులు దిగుమతి చేసుకోవద్దని కోరుతున్నారు. మన డబ్బులతో వాళ్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పూణేలోని యాపిల్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. టర్కీ యాపిల్స్‌ను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
బాయ్‌కాట్ నినాదంతో టర్కీ టూరిజం దెబ్బతింటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే పాకిస్థాన్‌కు మద్దతు నిలిచిన అజర్‌బైజాన్‌ను కూడా బాయ్‌కాట్ అంటున్నారు.
Also Read : ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
#WATCH | Pune, Maharashtra: Following Turkey's support for Pakistan amid recent tensions with India, Apple traders in Pune say they have decided to boycott Turkish apples
— ANI (@ANI) May 13, 2025
Suyog Zende, an apple trader at Pune's APMC market, says, "We have decided to stop buying apples from… pic.twitter.com/tldXdCF4p7
Also Read: పాక్ ఎయిర్ బేస్‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి
ఇదిలాఉండగా పాకిస్థాన్‌కు టర్కీ ఆయుధాలు సరఫరా చేస్తోంది. చైనా ఆయుధాలు ఫెయిల్ కావడంతో పాక్.. టర్కీ డ్రోన్లు వాడింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ దేశానికే టర్కీ సపోర్ట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టర్కీతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : పాకిస్థాన్ బిగ్ షాక్.. అతడు వెంటనే వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశం
telugu-news | national-news