/rtv/media/media_files/2025/02/22/SQcNO65rhDMbpJCryXwk.jpg)
ED Entered In Falcon Scam Case
హైదరాబాద్ (Hyderabad) లోని హైటెక్ సిటీ హుడా ఎన్ క్లేవ్ కేంద్రంగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Falcon Capital Ventures Pvt Ltd) సంస్థ మొత్తం 6, 979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1700 కోట్లు వసూలు చేసింది. ఇన్వాయిస్ డిస్కౌంట్స్ ఆఫర్ పేరుతో ఏటా 11 నుంచి 22 శాతం రిటర్న్స్ ఇస్తామని నిర్వాహకులు నమ్మించి మోసం చేశారు. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా.. మరో రూ. 850 కోట్లు దుబాయ్, మలేషియా సహా మొత్తం 14 షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సైబరాబాద్ పోలీసులు కనుగొన్నారు. ఢిల్లీకి చెందిన పలువురి దీని మీద ఫిర్యాదు చేసారు. వీటి ఆధారంగా ఈ నెల 11న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఈవోడబ్ల్యూ పోలీసులు.. ఆదివారం ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ ఓదెల పవన్ కుమార్, డైరెక్టర్ కావ్య నల్లూరిని అరెస్ట్ చేశారు. తరువాత ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంతను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: Social Media: సీతాకోక చిలుకను చంపి శరీరంలోకి ఇంజెక్ట్.. చివరకు..
Also Read : పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం!
ఈడీ కేసు..
అయితే ఈ కేసులో ప్రధాన నిందుతులు అయిన ఫాల్కన్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, సీఈవో యోగేందర్ సింగ్ దుబాయ్‌కి పారిపోయారు. వీరిపై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పుడు ఈ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్ళింది. సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈవోడబ్ల్యూ) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద దీనిని దర్యాప్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈడీ సోదాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: USA: భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్
Also Read : ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే?
 Follow Us