/rtv/media/media_files/2025/02/22/MM86UuKmbl79N8GhCddH.jpg)
New FBI Director Kash Patel
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. వైట్ హౌస్ లో అటార్నీ జనరల్ పామ్ బోండీ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ భగవద్గీత మీద ప్రమాణం చేసి మరీ తన పదవిని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాష్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్‌కిన్స్, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. అలెక్సీస్ భగవద్గీతను పట్టుకోగా...దానిపై కాష్ పటేల్ చేయి ఉంచి ప్రమాణం చేశారు.
Also Read: Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
రాగానే సంచలన నిర్ణయాలు..
కొత్త ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అమెరికా ఎఫ్బీఐ లోపల, బయటా కూడా జవాబుదారీతనంతో పని చేస్తుందని చెప్పారు. అలాగే సంస్థలో ప్రధాన కార్యాలయంలో వెయ్యి మంది ఉద్యోగులను దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల ఫీల్డు ఆఫీసులకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 500 మందిని హంట్స్ విల్లే, అలబామా బ్యూరోకు పంపిస్తామని చెప్పారు.
భారత సంతతికి చెందిన కాష్ పటేల్ డొనాల్డ్ ట్రంప్‌కి వీర విధేయుడు. అందుకే ఈయనను అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు డైరెక్టర్‌గా నియమించారు ట్రంప్. కాష్ పటేల్ నియామకంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా.. ఆయనకు అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు పడ్డాయి. దీంతో ఈయన నియమాకం అధికారికంగా ధ్రువీకరించినట్టయ్యింది. రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్ నియమాకాన్ని వ్యతిరేకించారు.
Also Read: Social Media: సీతాకోక చిలుకను చంపి శరీరంలోకి ఇంజెక్ట్.. చివరకు..