Cyber Crime: పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం!

రాజ్‌కోట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. PDF రూపంలో పెళ్లి కార్డు పంపించి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందిని ఇలాగే ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
cyber crime

సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) మితిమిరిపోయారు. రోజుకు కొత్తకొత్త టెక్నాలజీ, టెక్నిక్ లతో అమాయకపు ప్రజలను బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా వెడ్డింగ్ కార్డు (Wedding Card) ను PDF రూపంలో పంపించి లక్షల్లో కాజేశారు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో జరిగింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 మంది ఫోన్లు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేశారు.  

Also Read :  ఆత్మహత్యకు దారితీసిన క్షణికావేశం.. భర్త బయటకు తీసుకెళ్లలేదని.. భార్య ఏం చేసిందంటే?

2025 ఫిబ్రవరి 14వ తేదీన రాజ్‌కోట్‌లోని కోలితాడ్ గ్రామానికి చెందిన రియాజ్ భాయ్ కు అతని బంధువు ఇషాన్ భాయ్ నుంచి ఫోన్‌కు ఓ మేసేజ్  వచ్చింది. నా పెళ్లికి రండి అంటూ ఒక PDF ఫైల్ కూడా ఉంది. రియాజ్ భాయ్ సంతోషిస్తూ ఆ పెళ్లి కార్డు చూద్దామని  డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే, అతని ఫోన్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్ళింది. మొదట్లో  అతని బ్యాంకు ఖాతానుంచి కేవలం రూ.1 మాత్రమే కట్ అయింది.   తర్వాత నెమ్మదిగా మొత్తం రూ.75వేలు మాయం అయ్యాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతని డబ్బు మరోకరి జేబులోకి వెళ్లిపోయింది. 

Also Read :  కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

రియాజ్ భాయ్ ఒక్కడే కాదు. కోలితాడ్ గ్రామానికి చెందిన రైతు శైలేష్ భాయ్ సావ్ల్యా విషయంలో కూడా అదే జరిగింది. పొలంలో రోజంతా కష్టపడి పనిచేసే శైలేష్ భాయ్ కి కూడా ఇలాంటి వివాహ ఆహ్వానం అందింది. అతడు దానిని ఓపెన్ చేయగానే కొద్దిసేపటికే అతని ఖాతా నుండి రూ. 24 వేలు మాయం అయ్యాయి.  దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

Also Read :  భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్

రూ.1.38 కోట్లు కాజేశారు

ఇక హైదరాబాద్ లో కూడా ఇలాంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. డిజిటల్​అరెస్ట్ (Digital Arrest)​ పేరిట సైబర్ నేరగాళ్లు 82 ఏళ్ల వృద్ధుడి బ్యాంక్​ఖాతా నుంచి రూ.1.38 కోట్లు కాజేశారు. ఈ కేసులో సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై సైబర్​క్రైమ్​ అఫీసర్లమంటూ​మాట్లాడుతూ అతని బ్యాంక్​అకౌంట్ల నుంచి రూ.1.38 కోట్లు ట్రాన్స్​ఫర్​చేసుకున్నారు. 

Also Read :  దొంగిలించిన డబ్బుతో లవర్లతో కలిసి మహాకుంభమేళాకు..చివరకు బిగ్ ట్విస్ట్!

Advertisment
తాజా కథనాలు