/rtv/media/media_files/2025/11/15/car-2025-11-15-07-59-38.jpg)
Car Accident At Jubilee Hills
హైదరాబాద్ లో ఓ యువతి అర్థరాత్రి తాగి రెచ్చిపోయింది(drunk-and-drive). అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్(jubilee-hills) లో ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన యువతి వేగంగా వచ్చి అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. కారు నడుపుతున్న సమయంలో యువతి మద్యం సేవించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అధిక వేగం, మద్యం మత్తు కారణంగా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు బోల్తా పడినప్పటికీ, కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఆ యువతికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఆ యువతి డ్రైవింగ్ సీటులో ఇరుక్కుపోవడంతో స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి ఆమెను అతి కష్టం మీద బయటకు తీశారు.గాయపడిన యువతిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : నీచుడు.. వైద్యం కోసం వచ్చిన మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకిన వైద్యుడు.. బయటపడ్డ వీడియో!
Also Read : నడిరోడ్డు మీద పట్టపగలు.. భార్య గొంతు కోసం దారుణంగా హత్య చేసిన భర్త.. కారణమేంటంటే?
Follow Us