Infosys: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్..తన బెంగళూరు బ్రాంచ్ఉద్యోగులకు వార్నింగ్ మెయిల్స్ పంపించింది. మీరు ఆఫీసుకు రావొద్దు.. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేయండి. మళ్లీ మేము మీకు తిరిగి రండి అనే మెయిల్స్ పంపే వరకు రావద్దని, ఈ రూల్స్ ని అందరూ పాటించాలని..కాదు కూడదని మీరు ఆఫీసుకు వస్తే మీరే ప్రమాదంలో పడతారంటూ హెచ్చరికలు జారీ చేసింది. Also Read: Crime: న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి గొంతు కోసి చంపేశారు! స్వయంగా హెఆర్ డిపార్టుమెంటే ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది.. ఇంతకీ ఇన్ఫోసిస్ ఎందుకు ఉద్యోగులకు అలా మెయిల్స్ పంపించిందంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్ లో అనుకోని అతిథులు తిరుగుతున్నారు. దీంతో డిసెంబర్ 31న ఉద్యోగులందరూ ఇంటివద్ద నుంచే వర్క్ కంపెనీ హెచ్ఆర్ డిపార్టుమెంట్ మెయిల్స్ ఉద్యోగులకు పంపింది. Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్ట్ కు దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం చిరుతపులులకు నిలయం.. అప్పుడప్పుడు క్యాంపస్ ఆవరణలో కూడా కనపడుతుండేవి. రెండూ మూడు రోజులుగా క్యాంపస్ ఆవరణలో తిరుగుతుండటంతో ఉద్యోగులకు భయం పట్టుకుంది. Also Read: Telangana: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు మైసూర్ ఇన్ఫోసిస్ లో చిరుతపులి సంచారం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఓసారి క్యాంపస్ ఆవరణలోకి వచ్చి హల్ చల్ చేసింది. 2011లో ఓ సారి క్యాంపస్ లోకి రావడంతో ఉద్యోగులు సిబ్బంది భయంతో పరుగులు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు మరోసారి క్యాంపస్ ఆవరణలో కనిపించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు! ఉద్యోగుల భద్రత కోసం... వారికి వర్క్ ఫ్రం హోం ప్రకటించడమే కాకుండా.. క్యాంపస్ ఆవరణలోకి చిరుత రాకుండా అటు అటవీశాఖ, ఇటు టాస్క్ ఫోర్స్ సిబ్బందితో ముందస్తుగా భద్రత చర్యలు చేపట్టింది.