Telangana: తెలంగాణలో చలి రోజురోజుకి పెరిగిపోతుంది.నవంబర్ తొలి రెండు వారాల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తుపాను తరహా వాతావరణంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంచెం తగ్గింది. ఆకాశంలో మేఘాలు ఉండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోయినా... చలి తీవ్రత మాత్రం అంతగా లేదు. Also Read: Ap Govt: ఏపీలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్ లకు పదోన్నతులు! తాజాగా మరోసారి రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది.చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 15 డిగ్రీలక కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. తెలంగాణలో రాబోయే 5 రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అధికారులు తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం పటాన్‌చెరులో అతి తక్కువగా 13.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. Also Read: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చాలా ప్రాంతాల్లో 14 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు.నేడు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా వ్యాపిస్తుందని అన్నారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీల సెల్సియస్ నుంచి 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశలున్నాయని అధికారులు చెప్పారు. ఉపరిత గాలులు ఈశన్య దిశలో గంటకు 6-8 కి.మీ వేగంతో బలంగా వీచే అవకాశాలున్నాయని తెలిపారు. Also Read: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి! ఈ మేరకు ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.ఇక దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల మేర మేఘాలతో ఉందని సమాచారం ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతున్నాయని చెప్పారు. అందువల్ల ఇది క్రమంగా బలపడుతోందని వెల్లడించారు. Also Read: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే! ఈ అల్పపీడనం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అలా కాకుండా.. దిశ మార్చుకొని ఉత్తరం వైపు వస్తే.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అధికారుల పేర్కొన్నారు.