TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!

పేకాట ఒకరి ప్రాణం తీసింది. అయితే ఇది ఏదో గొడవ మూలంగా జరిగిన మృతి మాత్రం కాదు. పేకాట స్థావరపై పోలీసులు దాడి చేయడంతో భయంతో పారిపోతుండగా వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

New Update
Police raid on poker establishment.. Man dies of heart attack

Police raid on poker establishment.. Man dies of heart attack

Crime News :పేకాట ఒకరి ప్రాణం తీసింది. అయితే ఇది ఏదో గొడవ మూలంగా జరిగిన మృతి మాత్రం కాదు. పేకాట స్థావరపై పోలీసులు దాడి చేయడంతో భయంతో పారిపోతుండగా వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో స్థాపరంపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో  పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాజయ్య అనే వ్యక్తి పరుగెత్తుతుండగా అక్కడిక్కడే  కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.  

ఇది కూడా చూడండి:Skin Health: అరేబియన్ భామల అందం వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా?

అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్య (55) చాలాకాలంగా  గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.  అయితే ఆయనతో పాటు మరికొందరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారు. ఆ సమయంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఆ భయంతో రాజయ్యతో పాటు అక్కడినుంచి మరికొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. మానేరు వాగు దాటి ఒడ్డుపైకి చేరే క్రమంలో అతనికి శ్వాస సబంధ ఇబ్బందులు తలెత్తి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన మిగతా వారు ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం   ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisment
తాజా కథనాలు