Harish Rao : క్లబ్బులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండు? రేవంత్‌ పై మండిపడ్డ హరీశ్‌రావు

క్లబ్లులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండని సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. నేడు ఢిల్లీలో జరిగిన సీఎంల భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలోని వ్యాఖ్యలపై మండిపడ్డారు.

New Update
Harish Rao

Harish Rao

క్లబ్లులకు పబ్బులకు రానన్నోడు సెవన్ స్టార్ ప్యాలెస్ కు ఎట్ల పోయిండని సీఎం రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడ్డ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.నేడు ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జరిపిన మీడియా సమావేశంలోని వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్లి సవాల్ విసిరితే రేవంత్ రెడ్డికి మొహం చాటేసిండు.క్లబ్లులకు పబ్బులకు రాను అని బిల్డప్ ఇచ్చిండు. ఈరోజు రేవంత్ సెవన్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టిండు. అధికారిక నివాసం ఉంటది ఢిల్లీలో, తెలంగాణ భవన్ ఉంటది అక్కడ ప్రెస్ మీట్‌పెట్టలేదని విమర్శించారు.రేవంత్ మాటలకు చేతలకు పొంతన లేదన్నారు.

ఇది కూడా చదవండి:డయాబెటిక్ రోగి ఉదయం ఏం తినాలో తెలుసా..? రక్తంలో చక్కెర నియంత్రణ కోసం..

Harish Rao Gets Angry At Revanth

 బనకచర్లపై భేటీలో చర్చకు రాలేదని మీడియా మిత్రులకు అబద్దాలు చెప్పారని, నిజానికి భేటీలో మొదటి అంశమే బనకచర్ల ప్రాజెక్టు గురించి అన్నారు. రేవంత్, ఉత్తమ్ ల మీడియా సమావేశం కంటే ముందే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు బనకచర్ల ప్రాజెక్టుపై కమిటీ వేశామని ప్రకటించారన్నారు. లోపల జరిగింది దాచి, ప్రజలకు బాహాటంగా అబద్దాలు చెప్పినందుకు తెలంగాణకు రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బనకచర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్ వెళ్ళబోమని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు పోయాడని ప్రశ్నించారు.ఎందుకు ఢిల్లీకి వెళ్లావు. అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో నీతి అయోగ్ మీటింగ్ కు పోను అని అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఆ తర్వాత నీతి అయోగ్ మీటింగ్ లో అటెండ్ అయ్యారు.

Also Read : కింగ్‌డమ్ నుంచి వచ్చేసిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్.. వీడియో చూశారా?

 బనకచర్ల వివాదంపై ఏర్పాటు చేయబోయే కమిటీ ఏది చెబితే అదే చేస్తానని రేవంత్ ఎలా ఒప్పుకుంటారని, చంద్రబాబు చేతుల్లో ఉన్న కేంద్రం, కమిటీ చేత తెలంగాణ నీటి జలాలు ఏపీకి అప్పగిస్తే అంగీకారం తెలియజేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం తెలిపిన బనకచర్లపై కమిటీకి అంగీకరిస్తూ రేవంత్ ఎలా సంతకం చేస్తారని అన్నారు.ఏపీకి, చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లించేందుకు ప్రజలు నిన్ను ఎన్నుకోలేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి బనకచర్ల మీటింగ్ పెట్టడమే తప్పు అన్న హరీశ్‌రావుసెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటిలు బనకచర్ల ప్రీ ఫీజబులిటి రిపోర్టును తిరస్కరించాయన్నారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థలు నిర్ద్వంద్వంగా అనుమతులు తిరస్కరించాయి.కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా మీటింగ్ పెట్టిందని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి వెళ్లి కమిటీ వేయండి, కమిటీ ఎట్ల చెబితే గట్ల అని ఎట్ల అంటడని హరీశ్‌రావు ప్రశ్నించారు.

ఇది కూడా చూడండి: Aadhaar Card: కోట్లల్లో మరణాలు.. ఇంకా యాక్టివ్‌లో ఉన్న ఆధార్‌ కార్డులు

 రేవంత్‌ రెడ్డి ఈరోజు చేసిన ద్రోహానికి చెంపలు వేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ బనకచర్లను ఒప్పుకోదు.అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని గతంలోనే డిమాండ్ చేశాం. మాకు బేషజాలు లేవు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మీలాగా రాజకీయాలు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, బాబు ప్రయోజనాల కోసం చేశావు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పదం తేటతెల్లం అయ్యింది. బేషరతుగా క్షమాపణలు చెప్పు అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం

harishrao | cm-revanthreddy | Banakacharla | banakacherla project | krmb-project | krmb | ap cm chandrababu naidu

Advertisment
Advertisment
తాజా కథనాలు