Ghanta Chakrapani: ఘంట చక్రపాణి నియామకంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఓపెన్ యూనివర్సిటీ VCగా ఘంట చక్రపాణికి అర్హతలు లేవని హనుమకొండ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ బీ.కుమారస్వామి హైకోర్టులో కోవారెంటో పిటిషన్‌ వేశారు. జనవరి 23న పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.

New Update
ghanta chakrapani

ghanta chakrapani Photograph: (ghanta chakrapani)

Ghanta Chakrapani: డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా 2024 డిసెంబర్ 7న ప్రొఫెసర్ ఘంట చక్రపాణిని తెలంగాణ రాష్ట్ర నియమించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రేవంత్ సర్కార్ జీవో 227ను విడుదల చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా  చక్రపాణికి అర్హతలు లేవని, జీవో 229ను రద్దు చేయాలని కోరుతూ హనుమకొండకు చెందిన అసోసియేట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీ.కుమారస్వామి హైకోర్టులో కోవారెంటో పిటిషన్‌ వేశారు. ఘంటా చక్రపాణి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read :  ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!

నిబంధనలకు విరుద్ధంగా చక్రపాణి నియామకం..

జనవరి 23న (గురువారం) జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ఈ పిటిషన్‌ను విచారించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా చక్రపాణి నియామకం జరిగిందని చెప్పారు. ఆయనకు వయో పరిమితి కూడా దాటిపోయిందని కోర్టుకు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఫిబ్రవరి 11లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. నియామకంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యామండలి, యూజీసీతోపాటు వీసీ ఘంట చక్రపాణిలను హైకోర్టు ఆదేశించింది. 

Also Read : మీర్పేట్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్..  కుక్కతో ఆ పని చేయలేదన్న గురుమూర్తి!

Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్‌ బంపరాఫర్!

Also Read : భలే ఛాన్స్ మిస్‌.. విశ్వనాథ్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు