/rtv/media/media_files/2025/01/24/Dr6PnyDIo3l5mQdxj0LK.jpg)
meerpet murder case Photograph: (meerpet murder case)
Meerpet Murder Case: మీర్ పేట్ మర్డర్ కేసులో రోజుకో కొత్తకోణం బయటపడుతుంది. రిటైర్డ్ ఆర్మీ జవాన్ అయిన గురుమూర్తి(Guru Murthy) తన భార్య మాధవిని(Madhavi) అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే గురుమూర్తి తన భార్యను ముక్కలుగా నరికే ముందు ప్రాక్టీస్ కోసం ఓ కుక్కను నరికి చంపినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై గురుమూర్తి స్పందించినట్లుగా తెలుస్తోంది. తానే తన భార్యను చంపిన అని ఒప్పుకున్న తరువాత మళ్లీ కుక్కను చంపానని ఎందుకు ప్రచారం చేస్తున్నారని పోలీసులతో గురుమూర్తి వాదించినట్లుగా సమాచారం. పోలీసుల విచారణలో భాగంగా కుక్క హత్య వార్తలపై గురుమూర్తి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తానెప్పుడూ కూడా కుక్కను పెంచుకొలేదని అలాంటిది కుక్కను తానెందుకు చంపుతానని గురుమూర్తి పోలీసులకు వివరించినట్లు సమాచారం. భార్యను చంపేముందు కుక్కను చంపి ట్రైల్ చేశాడనేది పూర్తిగా అవాస్తవమని గురుమూర్తి పోలీసులకు తేల్చి చెప్పాడు.
Also Read : భర్తతో విడిపోతున్న మరో హీరోయిన్.. ఫొటోలు డిలీట్!
మరో వైపు గురుమూర్తి కేసు విచారణలో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన భార్యను తానే హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే... తాను చంపాను అనడానికి ఆధారాలు ఏంటని అని పోలీసులను తిరిగి ప్రశ్నిస్తున్నాడు. పైగా కోర్టులో మీ సంగతి చూసుకుంటానని పోలీసులనే బెదిరిస్తున్నాడు. గురుమూర్తే హత్య చేశాడని తెలుస్తున్నా...ఒక్క ఆధారం కూడా దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read : నాలుగో రోజు కంటిన్యూ .. దిల్ రాజు ఇళ్లల్లో కొనసాగుతున్న ఐటీ దాడులు
శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లు..
తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలును గుర్తించారు. మాధవి శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి డీఎన్ఏ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల డీఎన్ఏతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
Also Read : ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్!
గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత రిటైరయ్యారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం ఇతడికి వెంకటమాధవితో పెళ్లి జరిగింది. వీళ్లకు ఇద్దరు సంతానం. వెంకటమాధవి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని.. త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని మీర్‌పేట పోలీసులు వెల్లడించారు.
Also Read : నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!