BIG BREAKING: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27న శనివారం శిల్పాకళా వేదికలో గ్రూప్‌ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నారు.

New Update
BREAKING

BREAKING

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 27న శనివారం శిల్పాకళా వేదికలో గ్రూప్‌ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ నియామక పత్రాలు అందజేయనున్నారు. 18 శాఖలకు సంబంధించి 562 పోస్టులకు అభ్యర్థులను తాము ఎంపిక చేశామని సీఎస్‌ రామకృష్ణారావు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి తప్పుకున్న L&T

ఇదిలాఉండగా 562 గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి TGPSC ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, అలాగే మెయిన్స్ పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వాళ్ల జాబితాను విడుదల చేసింది. మొత్తంగా 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. ఇక మిగిలిన ఒక పోస్టు న్యాయవివాదం ఉన్న నేపథ్యంలో  హోల్ట్‌లో పెట్టామని వెల్లడించారు. 

Advertisment
తాజా కథనాలు